MI vs KKR: 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో ముంబైపై కేకేఆర్‌ విజయం

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ముంబై ఇండియన్స్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 9 మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చిన స్టార్క్ 10వ మ్యాచ్‌లో ముంబైపై మెరిశాడు. 24.75 కోట్లతో ఐపీఎల్ లో అడుగుపెట్టిన మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటర్లను వణికించేశాడు.

MI vs KKR: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ముంబై ఇండియన్స్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 9 మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చిన స్టార్క్ 10వ మ్యాచ్‌లో ముంబైపై మెరిశాడు. 24.75 కోట్లతో ఐపీఎల్ లో అడుగుపెట్టిన మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటర్లను వణికించేశాడు. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్ లో మిచెల్ స్టార్క్ ఇషాన్ కిషన్ వికెట్‌తో వికెట్ల వేట ప్రారంభించాడు. స్టార్క్ ఇషాన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ దారి చూపించాడు. 17వ ఓవర్‌లో టిమ్ డేవిడ్‌ ని అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ పీయూష్ చావ్లా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన స్టార్క్ ఐదో బంతికి గెరాల్డ్ కోయెట్జీ మిడిల్ స్టంప్‌ను కూల్చివేసి కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాన్ని ఖాయం చేశాడు. ఇనింగ్స్ లో స్టార్క్ ఇలా ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. 3.5 ఓవర్లలో స్టార్క్ 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ముంబై తరుపున బుమ్రా మెరిశాడు. బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్‌లకు బుమ్రా పెవిలియన్ దారి చూపించాడు. ఈ ఫీట్ ద్వారా బుమ్రా వాంఖడే మైదానంలో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఒకే మైదానంలో 50కి పైగా వికెట్లు తీసిన 5వ బౌలర్ బుమ్రా. బుమ్రా కంటే ముందు సునీల్ నరైన్, లసిత్ మలింగ, అమిత్ మిశ్రా, యుజ్వేంద్ర చాహల్ ఈ ఘనత సాధించారు. ఈడెన్ గార్డెన్స్‌లో 69 వికెట్లతో నరైన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

We’re now on WhatsApp : Click to Join

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.లక్ష్యచేధనలో ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకు కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/33) నాలుగు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో రెండు వికెట్లు తీసారు.

12 ఏళ్ల తర్వాత వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ విజయం సాధించింది. గతంలో కోల్‌కతా ఈ మైదానంలో చివరిసారిగా 2012లో విజయం సాధించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, ఆంగ్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, ఆంగ్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

Also Read: Tea: టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే బీ అలర్ట్