Site icon HashtagU Telugu

Virat Kohli @Gym:జిమ్ లో చెమటోడ్చుతున్న విరాట్

Virat Kohli

Virat Kohli

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ పర్వాలేదనిపించిన కోహ్లీ ఇప్పుడు హాంకాంగ్ తో మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. భారత్ బుధవారం హాంకాంగ్ తో తలపడనుండగా.. తన పూర్తి ఫామ్ అందుకోవాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. తాజాగా తాను జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫొటోస్ ను కోహ్లీ ఫాన్స్ తో పంచుకున్నాడు. చాలా కాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న విరాట్ పాకిస్తాన్ తో మ్యాచ్ లో మాత్రం రాణించాడు.

అభిమానులంతా ఈ మ్యాచ్ లో పాత కోహ్లీని చూశారు. బ్యాటింగ్ ను ఆస్వాదిస్తూ తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు.చూడచక్కని బౌండరీలతో పాటు వికెట్ కీపర్ మీదుగా కొట్టిన సిక్సర్ అయితే మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 34 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్సర్ తో 35 పరుగులు చేశాడు. ఆసియా కప్ లో రాబోయే మ్యాచ్ లలో కూడా కోహ్లీ ఇదే సానుకూల దృక్పథంతో ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.