Site icon HashtagU Telugu

Kohli Crying: గదిలో ఏడుస్తూ కూర్చున్న కోహ్లీ.. సీక్రెట్ రీవీల్ చేసిన అనుష్క

Kohli Crying

Kohli Crying

Kohli Crying: ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ (Kohli Crying) ఫామ్ చర్చనీయాంశంగా మారింది.పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకాన్ని నమోదు చేసిన విరాట్ కోహ్లి తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత సిరీస్‌లో అతని సగటు 25.06 మాత్రమే. ఇప్పుడు విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాల్గవ టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. దానికి ముందు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

విరాట్ కోహ్లి ఫామ్‌లో లేనప్పుడు అతని మనస్తత్వం ఎలా ఉంటుందో అనుష్క నాతో పంచుకుందని వరుణ్ ధావన్ చెప్పాడు. 2018లో బర్మింగ్‌హామ్ టెస్ట్ గురించి వరుణ్ చెప్తూ.. ఆ టెస్టులో భారత్ ఓడిపోయింది. ఆ రోజు మ్యాచ్ చూసేందుకు వెళ్లలేదని అనుష్క చెప్పింది. హోటల్‌కి తిరిగి వచ్చేసరికి విరాట్ గదిలో ఏడుస్తూ కనిపించాడట. నిజానికి ఆ సిరీస్ లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 97, 103 పరుగులతో సత్తా చాటిన కింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతను ఓటమి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కొంప‌ముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్‌!

ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పెర్త్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తప్ప కోహ్లి బ్యాట్ నుంచి ఆశించిన పరుగులు రాలేదు. మెల్‌బోర్న్‌లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ విమర్శకుల నోళ్లు మూయిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో జరిగిన గత మూడు టెస్టుల్లో 52.66 సగటుతో స్కోర్ చేశాడు. ఆ పిచ్ పై కోహ్లీ అత్యుత్తమ స్కోరు 169. సిడ్నీలో అతను 49.60 సగటుతో 248 పరుగులు చేశాడు.