Site icon HashtagU Telugu

Kohli Style: డాన్స్ తో అదరగొట్టిన కోహ్లీ

Kohli Shakes His Leg With Norwegian Dance Group Quick style

Kohli Shakes His Leg With Norwegian Dance Group Quick style

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Kohli) అద్భుతమైన బ్యాటరే కాదు.. మంచి డాన్సర్ కూడా..ఎన్నోసార్లు తన స్టెప్పులతో గ్రౌండ్ లోనే సందడి చేశాడు. ప్రాక్టీస్ సమయంలోనూ, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడూ కోహ్లీలోని డాన్స్ టాలెంట్ అందరూ చూశారు. తాజాగా మరోసారి విరాట్ డాన్స్ లో అదరగొట్టేశాడు. ఆసీస్ వన్డే సిరీస్ కోసం ముంబై వెళ్లిన విరాట్.. అక్కడ నార్వేకు చెందిన డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్ తో కలిసి స్టెప్పులేశాడు. స్టీరియో నేషన్ కు చెందిన ఇష్క్ అనే పాటకు విరాట్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోలో గ్రూపులోని ఓ డ్యాన్సర్ కింద ఉన్న బ్యాట్ తీసుకొని చూస్తుంటాడు. ఆ తర్వాత సీన్ లోకి ఎంటరవుతాడు విరాట్. వైట్ టీషర్ట్, బ్లాక్ జీన్స్ లో సింపుల్ గా కనిపించిన కోహ్లి స్టెప్పులు మాత్రం ఆ గ్రూపుతో పోటీగా వేశాడు.బ్యాట్ పట్టుకొని ఎలా బ్యాటింగ్ చేయాలో వాళ్లకు చూపిస్తూనే అతడీ డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది.

కోహ్లీ (Kohli) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశాడు. క్లిక్ స్టైల్ ను విరాట్ కలిస్తే ఇలా ఉంటుంది అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేయగా… గంటలోనే సుమారు 6 లక్షల వరకూ లైక్స్ వచ్చాయి. కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ఫైర్ ఎమోజీలతో రియాక్టవడం కూడా వైరల్ గా మారింది. కొందరు యూజర్లు విరాట్ 76వ సెంచరీ డ్యాన్స్ ముందే లీకైంది అంటూ కామెంట్ చేశారు. ఈ డ్యాన్స్ గ్రూపు సభ్యులతో దిగిన ఫోటోను కూడా కోహ్లీ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కాగా భారత్ పాటలకు డ్యాన్స్ చేస్తూనే నార్వేకు చెందిన ఈ క్విక్ స్టైల్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.

ఇదిలా ఉంటే టెస్ట్ సిరీస్ ముగిసిపోవడంతో కోహ్లీతో పాటు వన్డే జట్టులో ఉన్న భారత ఆటగాళ్ళు ముంబై చేరుకున్నారు. తొలి వన్డే మార్చి 17న జరగనుండగా… తర్వాత విశాఖ , చెన్నైలలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్ లో తొలి వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో హార్థిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు.రెండో వన్డే నుంచి రోహిత్ జట్టుతో కలవనున్నాడు. అటు ఆసీస్ జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Also Read:  E-Scooter: “ఈ-స్కూటర్” కొంటే ఫారిన్ టూర్ ఫ్రీ.. ఏమిటి? ఎక్కడ?