Virat Kohli: కోహ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 12:14 AM IST

పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ తన ఫామ్ అందుకున్నాడు. ఆసియాకప్ లో గాడిన పడిన విరాట్ తాజాగా పాకిస్థాన్ తో సూపర్ 4 మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. సహచరులు పెవిలియన్ చేరుతున్నా… ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు.

చివరి వరకూ క్రీజులో ఉన్న కోహ్లీ 44 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండు రికార్డులు అందుకున్నాడు. ఈ హాఫ్‌ సెంచరీతో టీ ట్వంటీల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. విరాట్‌కు టీ ట్వంటీల్లో ఇది 32వ హాఫ్‌ సెంచరీ. తద్వారా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను వెనక్కి నెట్టాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 31వ హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ రికార్డును సమం చేసిన కోహ్లీ ఇప్పుడు పాక్ పై ఇన్నింగ్స్ తో హిట్ మ్యాన్ ను అధగమించాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ కెవిన్‌ పీటర్సన్‌, న్యూజిలాండ్‌ బ్యాటర్లు గప్టిల్‌, కేన్‌ విలియమ్సన్‌, ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఆరోన్‌ ఫించ్‌ల సరసన నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో ఓవరాల్ గా కోహ్లికి ఇది 194వ ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు.ఈ 194 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లలో 70 సెంచరీలు ఉన్నాయి. ఈ ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లలో సచిన్‌ టాప్‌ లో ఉన్నాడు. కాగా ఈ ఆసియాకప్ లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ కు దూసుకెళ్ళాడు. పాక్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 35 రన్స్ చేసిన కోహ్లీ హాంకాంగ్‌తో మ్యాచ్‌లోనూ 44 బాల్స్‌లో 59 రన్స్‌ చేశాడు.