Site icon HashtagU Telugu

Kohli: ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా కోహ్లీ

Virat Kohli

Virat Imresizer

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది జనవరిలో ఐసీసీ ఈ అవార్డు ప్రవేశపెట్టగా.. విరాట్‌కు ఫస్ట్ టైమ్ ఈ అవార్డు వరించింది. అక్టోబర్ నెలలో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాలను ఐసీసీ ఈ అవార్డు కోసం నామినేట్ చేసింది. అభిమానులు మాత్రం విరాట్‌కే ఈ అవార్డును కట్టబెట్టారు.ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగిన కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. 5 మ్యాచ్ ల్లో 246 రన్స్ చేశాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పై 82 పరుగులు చేసి తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు. కాగా డేవిడ్ మిల్లర్, సికిందర్ రాజా కూడా గట్టి పోటీ ఇచ్చినా…ఓటింగ్ లో కోహ్లీ నే అగ్రస్థానంలో నిలిచాడు .