Site icon HashtagU Telugu

Kohli Comments on Costly Cars: ఇష్టమొచ్చినట్టు కార్లు కొనేసా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Ipl 2023.. Kohli Make Interesting Comments On Costly cars

Ipl 2023.. Kohli Make Interesting Comments On Costly cars

Kohli Comments on Costly Cars : మన దేశంలో క్రికెటర్ల ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియాకు ఆడుతుంటే సంపాదన ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక కోహ్లీ (Kohli) లాంటి స్టార్ క్రికెటర్ అయితే కోట్లలోనే సంపాదిస్తాడు. అయితే డబ్బు ఖర్చు చేసే విషయంలో క్రికెటర్లు కాస్త దూకుడుగా ఉంటారు. ఇష్టానుసారం ఖర్చు చేస్తుంటారు. దీనిపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా ముందు వెనుకా చూడకుండా ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేసిన సందర్భాలున్నాయని చెప్పాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫోటో షూట్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చేతిలో డబ్బు ఉంది కదా అని పెద్దగా ముందుచూపుతో ఆలోచించకుండా తాను కార్లు కొనేవాడినని, ఇప్పుడు వాటన్నింటినీ అమ్మేసినట్లు అతడు చెప్పాడు. ఒకప్పుడు తాను పెద్దగా ఆలోచించకుండా కొనుగోలు చేసిన కార్ల గురించి చెప్పాడు. తాను వాడిన చాలా కార్లు ముందు చూపు లేకుండా కొన్నవేననీ, వాటిని తాను పెద్దగా నడిపింది కూడా లేదన్నాడు. అయికే ఒక సందర్భంలో అనవసరంగా కొన్నాను అనిపించి చాలా వాటిని అమ్మేసిన విషయాన్ని కోహ్లీ వెల్లడించాడు. ప్రస్తుతం తనకు ఖచ్చితంగా అవసరం అనుకున్న కార్లే వాడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఏవి అవసరం ఏవి కాదు అని తెలుసుకునే పరిణతి వచ్చిన తర్వాత అనవసరమైన కార్లను అమ్మేశానంటూ కోహ్లీ చెప్పాడు. తాను సొంతంగా కారు నడిపే ఆసక్తి లేదన్నాడు. కాగా డబ్బు ఖర్చు చేసే విషయంలో పరిణితి వచ్చేందుకు కొంచెం సమయం పట్టిందన్న విషయాన్ని కూడా కోహ్లీ వెల్లడించాడు.

ఇదిలా ఉంటే ఈ ఇంటర్యూలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడు కోహ్లీ. తన ఆరాధ్య క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, సచిన టెండూల్కర్ అని, వాళ్లు క్రికెట్ నే మార్చిన ప్లేయర్స్ అని కొనియాడాడు. ఇక తన కొత్త టాటూ గురించి కూడా కోహ్లీ మాట్లాడాడు. అది సగమే పూర్తయిందని, పూర్తయ్యాక చెబుతానన్నాడు. సినిమా యాక్టర్స్ కంటే క్రికెటర్ల పోస్టర్లను ఎక్కువగా ఇష్టపడేవాడినని విరాట్ చెప్పుకొచ్చాడు. కాగా భారత్‌లో తనకు ఉత్తరాఖండ్ అంటే చాలా ఇష్టమన్న కోహ్లీ అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కోసం కోహ్లీ రెడీ అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ కు ఎప్పటి నుంచే అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్ ను కోహ్లీ ఈ సారైనా అందిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బెంగళూరు తన తొలి మ్యాచ్ లో ఆదివారం ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.

Also Read:  Rohit Sharma: ఒకప్పుడు పాల ప్యాకెట్లు డెలివరీ.. రోహిత్ శర్మ గురించి వెలుగులోకి షాకింగ్ విషయం