గబ్బా టెస్టు డ్రా (Gabba Test) అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని వివాదాలు చుట్టుముట్టాయి. నాలుగో టెస్టు (Fourth Test) కోసం మెల్‌బోర్న్‌కు చేరుకున్న కోహ్లీతో అక్కడ మీడియా జర్నలిస్టులు వాగ్వాదానికి దిగారు. తమ కుటుంబ సభ్యుల ఫోటోలు తీయొద్దన్న దానికి ఆస్ట్రేలియన్ మీడియా కోహ్లీని టార్గెట్ చేసింది. దాంతర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్స్టాస్, విరాట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోహ్లీపై ఆస్ట్రేలియన్ మీడియా విషం కక్కుతూ కథనాలు రాసింది. తాజాగా కోహ్లీని టార్గెట్ చేస్తూ కంగారు అభిమాని ఒకరు కోహ్లీని కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడు. దీంతో కోహ్లీ కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చాడు.
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 86 బంతుల్లో 41.86 స్ట్రైక్ రేట్‌తో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లి, యశస్వి జైస్వాల్ మధ్య మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. విరాట్ కోహ్లి ఔట్ అయ్యి పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యాడు. కోహ్లీ తల వంచుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతుండగా, అభిమానులు కేకలు వేయడం ప్రారంభించారు. మొదట విరాట్ దానిని పట్టించుకోకుండా ముందుకు సాగాడు. అయితే కొందరి వ్యాఖ్యలు శృతిమించడంతో కోహ్లీ తిరిగి వెనక్కి వచ్చి అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లి ప్రేక్షకుల వైపు కోపంగా వస్తుండగా అక్కడ ఉన్న ఐసీసీ సిబ్బందిలో ఒకరు వచ్చి విరాట్‌ను లోపలికి తీసుకెళ్లారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ 4 మ్యాచ్‌లలో 6 ఇన్నింగ్స్‌లలో 162 పరుగులు చేశాడు. సగటు 32.40 మరియు స్ట్రైక్ రేట్ 56.64 తో బ్యాటింగ్ చేశాడు. ఇందులో కోహ్లీ 1 సెంచరీ కూడా చేశాడు. పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ అజేయంగా 100 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 7 మరియు11 పరుగులు అలాగే మూడో టెస్టులో 3 పరుగులు చేశాడు.
Read Also : AI Tools: కేంద్రం కీలక నిర్ణయం.. ఏఐ ద్వారా మోసాలకు చెక్..