Site icon HashtagU Telugu

world cup 2023: ఇంగ్లాండ్ ఆర్మీకి కోహ్లీ ఫ్యాన్స్ అదిరిపోయే రిప్లయ్

World Cup 2023 (69)

World Cup 2023 (69)

world cup 2023: లక్నో వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడింది. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఛేంజింగ్ లో తలపడిన భారత్ మెగాటోర్నీలో తొలిసారి మొదట బ్యాటింగ్ కి దిగింది. అయితే టాపార్డర్ పూర్తిగా నిరాశపరిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగ ఆడటంతో స్కోర్ గౌరవప్రదంగా మారింది. అయితే సెంచరీ చేస్తాడనుకున్న రోహిత్ 87 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

టీమిండియాకు అనుకున్నంత ఆరంభం దక్కలేదు. గిల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్కొక్కరు అవుటై వెళ్లిపోతున్నా.. కెప్టెన్ రోహిత్ మాత్రం బలంగా నిలబడ్డాడు. ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా వికెట్ ని కాపాడుకుంటూ ఆడాడు. రోహిత్ కి కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ జత కట్టడంతో విజయంపై ఆశలు చిగురించాయి. ఫలితంగా భారత్ 229 పరుగుల స్కోర్ చేసింది.

లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ పూర్తిగా చేతులెత్తేసింది.ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా మూడు పదుల స్కోర్ చేయలేకపోయారు.దీంతో 129 పరుగులకే చాపచుట్టేశారు. దీంతో టోర్నీలో ఇప్పటి వరకూ అపజయం ఎరుగని ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.అయితే ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ గోల్డెన్ డక్ అవ్వడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ప్రపంచ కప్ లో అసాధారణ బ్యాటింగ్ చేసిన ఈ రన్ మెషిన్ డకౌట్ కావడాన్ని హేళన చేస్తూ ఇంగ్లాండ్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కు చెందిన బార్మీ ఆర్మీ బాతుకు కోహ్లీ ఫోటోని అతికించి అతి చేసింది. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు. ఇంగ్లాండ్ జ‌ట్టులో ర‌న్ మెషిన్‌గా పేరొందిన జో రూట్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త అభిమానులు కూడా కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చారు. కోహ్లీ ఫ్యాన్స్ బర్మీఆర్మీకి గట్టిగానే బదులిచారు. కింగ్ జోలికి వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించారు. మీ దేశానికి హైప్ ఇచ్చేందుకు కూడా కోహ్లీనే కావాలి అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఎట్టాక్ చేశారు.

Also Read: Harish Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు

Exit mobile version