Virat Kohli Fans:వీరూపై కోహ్లీ ఫ్యాన్స్ గరం గరం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో శాసించే స్థితికి చేరిన భారత్ సిరీస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Sehwagvirat

Sehwagvirat

ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో శాసించే స్థితికి చేరిన భారత్ సిరీస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మ్యాచ్ ఫలితంతో పాటు కోహ్లీ, బెయిర్ స్టో మధ్య జరిగిన స్లెడ్జింగ్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. కొందరు కోహ్లీని సమర్థిస్తే… మరికొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్ పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ మూడో రోజు బెయిర్ స్టో బ్యాటింగ్ దిగిన సమయం నుండి కోహ్లి అతడిని స్లెడ్జింగ్ చేస్తూనే కనిపించాడు. కోహ్లీ కవ్వింపులకు బెయిర్ స్టో కూడా ధీటుగానే స్పందించాడు. చివరకు షమీ బౌలింగ్ లో కోహ్లికే క్యాచ్ ఇచ్చి బెయిర్ స్టో వెనుదిరిగాడు. అతడు ఔట్ కావడంతో కోహ్లి డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే కోహ్లీ అనవసరంగా రెచ్చగొట్టడం వల్లనే బెయిర్ స్టో సెంచరీ చేసాడంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ద్వారా విరాట్ పై సెటైర్లు వేశాడు. దీనితో పాటు కామెంటేటర్ గానూ కోహ్లీపై విమర్శలు చేశాడు. విరాట్ కోహ్లిని అమ్మాయితో పోల్చాడు. అతడు కామెంట్స్ ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. అయితే సెహ్వాగ్ కామెంట్స్ పై కోహ్లి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కామెంటేటర్ గా ఉండి ఓ గొప్ప ఆటగాడిపై ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం తగదని ట్వీట్స్ చేస్తున్నారు. సెహ్వాగ్ ను కామెంటేటర్ బాధ్యతల నుండి తప్పించాలని సూచిస్తున్నారు. గతంలో రోహిత్ శర్మను వడపావ్ అంటూ పిలిచిన సెహ్వాగ్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సెహ్వాగ్ మాటలను దేశం మొత్తం వింటుందని, సొంత దేశం ఆటగాడిని ఇలా కామెంట్ చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరకరంగా వ్యాఖ్యాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

  Last Updated: 04 Jul 2022, 05:22 PM IST