Site icon HashtagU Telugu

T20 Series : మరో రికార్డు ముంగిట కోహ్లీ

Kohli New

Kohli New

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి16న‌ మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ మొదలు కానుంది. అయితే ఈ టీ20 సిరీస్ కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లి ఓ అరుదైన వరల్డ్ రికార్డు పై కన్నేశాడు. ఈ మూడు టీ20ల సిరీస్‌లో విరాట్ కోహ్లి మ‌రో 75 ప‌రుగులు సాధిస్తే అంత‌ర్జాతీయ‌ టీ20 ఫార్మాట్ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డు సాధిస్తాడు… ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోన్యూజిలాండ్ సీనియర్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 3299 ప‌రుగుల‌తో అగ్ర స్థానంలో ఉండగా.., విరాట్ కోహ్లీ 3227 ప‌రుగుల‌తో రెండో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3197 ప‌రుగుల‌తో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు వన్డేల్లో కలిపి 116 పరుగులతో పర్వాలేదనిపించిన కోహ్లి… స్వదేశంలో మాత్రం పూర్తిగా నిరాశ పరిచాడు. సౌతాఫ్రికా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారు.

Exit mobile version