Kohli Ignored Gambhir: రాంచీలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లకు (Kohli Ignored Gambhir) సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ హెడ్ కోచ్‌ను పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో బయటకు రావడంతో కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే అలా చేశారా అనే విషయంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చ మొదలైంది.
కోహ్లీ, గంభీర్ మధ్య ‘ఉద్రిక్తత’ నిజమేనా?
ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పట్లో వారిద్దరూ వేర్వేరు జట్ల కోసం ఆడుతున్నారు. అయితే గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయిన తర్వాత వారిద్దరి మధ్య సంబంధాలు మెరుగ్గానే కనిపించాయి. కానీ ఆదివారం జరిగిన ఈ సంఘటన తర్వాత వారిద్దరి మధ్య ‘ఉద్రిక్తత’ చర్చ మళ్లీ ఊపందుకుంది.
గంభీర్‌ను కోహ్లీ పట్టించుకోలేదా?
రాంచీ వన్డే తర్వాత వైరల్ అవుతున్న వీడియోలో విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతున్నాడు. అతను మెట్లు ఎక్కుతూనే తన జేబులోంచి మొబైల్ తీసి చూడటం ప్రారంభిస్తాడు. గేటు లోపల గౌతమ్ గంభీర్ నిలబడి ఉన్నప్పటికీ కోహ్లీ ఆయనను చూడకుండా లోపలికి వెళ్లిపోతున్నాడు. కోహ్లీ లోపలికి వెళ్లేటప్పుడు గంభీర్ ఒక్కసారి కోహ్లీని చూసినా.. కోహ్లీ మాత్రం నేరుగా ముందుకు వెళ్లిపోయాడు.
Also Read: Russian Oil Supplies: గయానా నుంచి చమురు దిగుమతులు.. 17,700 కి.మీ సుదీర్ఘ ప్రయాణం!
Kohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q
— ADITYA (@Wxtreme10) December 1, 2025
కోహ్లీ, గంభీర్ మధ్య అంతా సవ్యంగా లేదా?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరికీ గౌతమ్ గంభీర్‌తో సంబంధాలు అంత సౌకర్యవంతంగా లేవని ఒక నివేదిక పేర్కొంది. వీరిద్దరూ టీ20 ఇంటర్నేషనల్టె, స్ట్ ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వన్డే క్రికెట్‌పై దృష్టి పెట్టారు. నివేదిక ప్రకారం.. ఇద్దరూ 2027 ప్రపంచ కప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. అయితే వారు ప్రపంచ కప్ జట్టులో భాగమవుతారనే హామీని టీమ్ మేనేజ్‌మెంట్ ఇవ్వడం లేదు. అంతేకాకుండా మొదటి వన్డే మ్యాచ్ కోసం రాంచీలో జరిగిన శిక్షణ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య నెట్ సెషన్‌లో ఎలాంటి సంభాషణ జరగలేదని కూడా ఆ నివేదికలో ఉంది.
వాదనలలో ఎంత నిజం ఉంది?
రాంచీలో విరాట్ కోహ్లీ 135 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత పెవిలియన్‌కు తిరిగి వచ్చినప్పుడు గౌతమ్ గంభీర్ ఆయనకు ‘సైడ్-హగ్’ ఇచ్చిన స్క్రీన్‌షాట్ కూడా మ్యాచ్ తర్వాత వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే గంభీర్- కోహ్లీ మధ్య సంబంధాలు పెద్దగా చెడిపోలేదని స్పష్టమవుతోంది. ఒక చిన్న వీడియో క్లిప్‌ను చూసి ఏదైనా అంచనా వేయడం సరికాదు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే డిసెంబర్ 3, బుధవారం రాయ్‌పూర్ (షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం)లో జరగనుంది. ఆ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
