Site icon HashtagU Telugu

Virat Kohli Record: సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ!

Happy Birthday Virat Kohli

Virat Kohli Imresizer

Virat Kohli beats Sachin: శ్రీలంకతో తొలి వన్డేలో Century కొట్టిన విరాట్ కోహ్లీ (Virat Kohli).HomeCountry లో 20 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సచిన్ ఇంతకుముందు ఈ ఘనత సాధించగా.. ఇప్పటివరకు 19 సెంచరీలతో ఉన్న కోహ్లీ తాజాగా ఆ రికార్డును అందుకున్నాడు. అలాగే సచిన్ మరో రికార్డును  కోహ్లీ బద్దలు కొట్టాడు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ విజృంభించారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ శతక భాగస్వామ్యానికి విరాట్‌ కోహ్లీ సెంచరీ (87 బంతుల్లో 113) తోడవడంతో లంకకు భారీ టార్గెట్‌ నిర్ధేశించారు. నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. వన్డేల్లో కోహ్లీ తన 45వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంక బౌలర్లలో రజితా 3 వికెట్లు తీయగా, మధుషంక, కరుణరత్నె, శనక, ధనంజయ చెరో వికెట్‌ తీశారు.