Site icon HashtagU Telugu

Kohli Breaks Record: రికార్డు సృష్టించిన‌ విరాట్ కోహ్లీ.. అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టిన భార‌తీయ ఆట‌గాడిగా గుర్తింపు!

ODI Batting Rankings

ODI Batting Rankings

Kohli Breaks Record: భారత్-పాక్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (Kohli Breaks Record) అద్భుతం చేశాడు. మాజీ వెటరన్ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కంటే ముందు మహ్మద్ అజారుద్దీన్ భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టాడు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ముందుకొచ్చాడు.

అత్యంత విజయవంతమైన భారత ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి క్యాచ్ పట్టి గొప్ప ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు 157 క్యాచ్‌లతో వన్డేల్లో అత్యంత విజయవంతమైన భారత ఫీల్డర్‌గా నిలిచాడు. కాగా మహ్మద్ అజారుద్దీన్ వన్డేలో 156 క్యాచ్‌లు అందుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అజారుద్దీన్ రికార్డును విరాట్ సమం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 2 క్యాచ్‌లు పట్టగా, ఇప్పుడు వన్డేల్లో 158 క్యాచ్‌లు అతని పేరిట ఉన్నాయి.

Also Read: Pandya Rumoured Girlfriend: పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ చూడ‌టానికి వ‌చ్చిన హార్దిక్ గ‌ర్ల్ ఫ్రెండ్‌!

బంగ్లా మ్యాచ్‌తో స‌మం చేసిన కోహ్లీ

భారత జట్టు అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి ఫీల్డింగ్ చేస్తూ భారీ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన మహ్మద్ అజారుద్దీన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 156 క్యాచ్‌లు అందుకున్నాడు.

భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉంది. దీనిని గురువారం విరాట్ కోహ్లీ సమం చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ 156 క్యాచ్‌లు పట్టాడు. విరాట్ కోహ్లీ 298 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అజారుద్దీన్ 334 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. వీరిద్దరు కాకుండా సచిన్ టెండూల్కర్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ వన్డేల్లో 140 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని పేరు మీద 124 క్యాచ్‌లు ఉన్నాయి. సురేశ్ రైనా పేరిట 102 క్యాచ్‌లు ఉన్నాయి.