world cup 2023: మెగాటోర్నీలో టీమిండియా లీగ్ మ్యాచ్ లు ముగిసాయి. ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా మొదలైన టీమిండియా దండయాత్ర నెదర్లాండ్స్ వరకు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సమిష్టిగా రాణిస్తున్న ఆటగాళ్లు వరుస మ్యాచ్ లలో గెలుస్తూ వచ్చారు. ఇప్పటికే సెమిస్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత్ సెమిస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇదిలా ఉండగా నిన్న ఆదివారం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ఆడిన ఐదుగురిలో ముగ్గురు ఫిఫ్టీ సాధించగా, ఇద్దరు బ్యాటర్లు సెంచరీతో కదం తొక్కారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 402 పరుగులతో అదరగొట్టింది. రోహిత్, గిల్, కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగగా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు శతకంతో మెరిశారు. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కాస్త తడబడినా ఫర్వాలేదనిపించింది. భీకర ఫామ్ లో ఉన్న భారత్ పై 250 పరుగులు చేయడం ఫర్వాలేదనిపించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాట్ తోనే కాకుండా బంతితోను సత్తా చాటారు. ఈ స్టార్ బ్యాట్స్ మెన్స్ బౌలింగ్ చేసి చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో కోహ్లీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ కూడా వికెట్ తీసుకున్నాడు. అయితే వీళ్లిద్దరి వికెట్స్ క్యాచ్ ల రూపంలో ఆటగాళ్లు అవుట్ అయ్యారు.
Also Read: Tollywood Stars Diwali Celebrations : తారల దీపావళి పండుగ కన్నుల నిండుగా..!