Kumble Vs Kohli : కుంబ్లే వైఖరి కోహ్లీకి నచ్చలేదు

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు భారత క్రికెట్ లోఒకప్పడు తీవ్రదుమారాన్నే రేపాయి.

  • Written By:
  • Publish Date - February 5, 2022 / 04:28 PM IST

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు భారత క్రికెట్ లోఒకప్పడు తీవ్రదుమారాన్నే రేపాయి. 2016-17లో టీమిండియా చీఫ్ కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే.. ఆటగాళ్లను ఇబ్బంది పెడుతన్నాడని కోహ్లి కామెంట్‌ చేయడం.. దీంతో కోచ్‌ పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఒప్పందం ముగియగా.. మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉన్నా.. అతను పోటీపడలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. వారి మధ్య నెట్స్‌లో గొడవ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. దాంతో.. కోచ్‌గా మంచి సక్సెస్ సాధించినప్పటికీ.. అవమానకరరీతిలో ఆ పదవికి కుంబ్లే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కోహ్లీకి, కుంబ్లేకు మధ్య ఏం జరిగిందనేది ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. అయితే తాజాగా ఆనాడు టీమిండియా మేనేజర్‌గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ వివాదంపై స్పష్టత ఇచ్చాడు.‘ఆన్ బోర్డ్’ అంటూ ఆయన రాసిన పుస్తకంలో దీని గురించి వివరించాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడు ఆటగాళ్లకు అండగా ఉండలేదని.. అలాగే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాడని కోహ్లీ భావించినట్లు రత్నాకర్‌ శెట్టి తన బుక్ లో పేర్కొన్నాడు.

2016లో జరిగిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ సమావేశంలో త్వరలోనే టీమిండియాకు మరో కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారి చెప్పినప్పుడు కుంబ్లే కూడా అక్కడే ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. అయితే పలు సందర్భాల్లో కోహ్లీ కుంబ్లే వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చారు. ఆటగాళ్ళకు అండగా ఉండకుండా… ఇబ్బంది కర వాతావరణం సృష్టిస్తున్నాడని కోహ్లీ భావించిన విషయాన్ని ఆయన తన పుస్తకంలో వెల్లడించారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు లండన్ లో జరిగిన సమావేశంలోనూ కొత్త కోచ్ కు సంబంధించి చర్చ జరిగిందని తెలిపాడు. ఆ తర్వాత కుంబ్లే రాజీనామా చేయడం, అతని స్థానంలో రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు జరిగిందని పుస్తకంలో రాసుకొచ్చారు.