Site icon HashtagU Telugu

KL Rahul: క్యాచ్ జారే.. మ్యాచ్ చేజారే!!

Rahul

Rahul

కెఎల్ రాహుల్ (KL Rahul) ఎంత పని చేశారో…ఇప్పుడు ఇండియా అభిమానులు కూడా అదే మాట అంటున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమికి ఒక్క క్యాచ్ కారణం. ఈ క్యాచ్‌ను జారవిడిచింది ఎవరో కాదు.. భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్. కీలక సమయంలో బెంగాల్ బ్యాట్స్ మెన్ మెహదీ హసన్ ఇచ్చిన క్యాచ్ ను రాహుల్ జారవిడిచాడు. ఫలితంగా చివరి వరకు క్రీజులో ఉన్న మెహదీ హసన్ బంగ్లాదేశ్‌కు విజయాన్ని అందించాడు.
42.3వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బంతి టాప్ ఎడ్జ్‌కి చేరి రాహుల్ సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ను వదులుకున్నాడు. అప్పటికి బంగ్లాదేశ్ స్కోరు 155/9. రాహుల్ ఈ క్యాచ్ పట్టి ఉంటే టీమిండియా 31 పరుగుల తేడాతో గెలిచి ఉండేది. రాహుల్ ఇచ్చిన లైఫ్ చూసి రెచ్చిపోయిన మెహిదీ హసన్.. ముస్తాఫిజుర్ సహకారంతో ఫోర్లు, సిక్సర్లతో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.

మెహిదీ, ముస్తాఫిజుర్ చివరి వికెట్‌కు అజేయంగా 51 పరుగులు జోడించి టీమ్ ఇండియా విజయావకాశాలపై నీళ్లు చల్లారు.
పేలవమైన ఫీల్డింగ్ కారణంగా భారత్ 136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. పరుగులు ఇచ్చి బంతిని బౌండరీకి చేర్చి బంగ్లాదేశ్ విజయానికి సహకరించాడు. ముఖ్యంగా కీలక సమయంలో మెహిదీ హసన్‌ క్యాచ్‌ను కేఎల్‌ రాహుల్‌ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. అందుకే మ్యాచ్‌లను క్యాచ్‌లు గెలుస్తామని అంటున్నారు.

Exit mobile version