Site icon HashtagU Telugu

Viral Video: కేఎల్ రాహుల్ చేసిన పనికి..సర్వత్రా ప్రశంసలు..!!వైరల్ వీడియో..!!

KL Rahul

KL Rahul

కెఎల్ రాహుల్….జింబాబ్వే సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన ఓ చిన్న పనితో ప్రచారంలోకి వచ్చారు. జింబాబ్వే, భారత జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ గురువారం జరిగింది. మ్యాచ్ కు ముందు భారత జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఇందులో భారత జట్టు సభ్యులంతా వరుసగా నిలుచున్నారు.

ఆ సమయంలో రాహుల్ నోట్లో చూయింగ్ గమ్ ఉంది. దాంతో గీతాలాపన ప్రారంభానికి క్షణాల ముందు …నోట్లోని చూయింగ్ గమ్ చేత్త బయటకు తీసి కింద పడేశాడు రాహుల్. దీంతో జాతీయ గీతం పట్ల తనకున్న గౌరవాన్ని చాటిచెప్పాడు కెఎల్ రాహుల్. దీంతో నెట్టింట్లో రాహుల్ పట్ల ప్రశంల జల్లులు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్లో షేర్ అవుతోంది. జాతీయ గీతానికి గౌరవాన్ని ఇచ్చాడని…ఆయన్ను చూసి గర్విస్తున్నామని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి వన్డేలో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఓపెనర్లు శుభ్ మన్ గిల్, శిఖర్ ధావన్ దంచికొట్టారు. దీంతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

https://twitter.com/AryanMane45/status/1560163019421757441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1560163019421757441%7Ctwgr%5E7ab6c4fdb25837aba1912283443bee3d1cd44b72%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-751379%2Fkl-rahuls-gesture-before-national-anthem-in-india-vs-zimbabwe-1st-odi-takes-internet-by-storm