Site icon HashtagU Telugu

KL Rahul, LSG fined: కె ఎల్ రాహుల్ కు షాక్

Lsg

Lsg

సూపర్ సెంచరీతో ముంబై లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ కే ఎల్ రాహుల్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. 24 లక్షలు జరిమానా విధించింది. ముంబై తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా ఈ చర్యలు తీసుకుంది. మిగిలిన ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ముంబై పై లక్నో బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయారు. లక్నో బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు వేయకేకపోవడం ఇది రెండోసారి.

ముంబై తో ఇంతకుముందు జరిగిన మ్యాచ్ లోనూ ఇదే తప్పిదం చేశారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేక పోవడంతో కెప్టెన్ కే ఎల్ రాహుల్ 12 లక్షల రూపాయాల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇది తొలి తప్పు. రెండోసారి కూడా అదే జరగడంతో జరిమానా రెట్టింపు అయింది. అలాగే కెప్టెన్‌తో పాటు మిగిలిన ప్లేయర్లూ ఆరు లక్షల రూపాయల చొప్పున ఫైన్ కట్టాలి. ఇప్పటికే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సార్లు స్లో ఓవర్ రేటు జరిమానాకు గురయ్యాడు. మరోసారి ఇదే తప్పిదం చేస్తే 100 శాతం ఫైన్ తో పాటు ఒక మ్యాచ్ నిషేధానికి గురవుతారు.ఇదిలా ఉంటే ముంబైతో జరిగిన మ్యాచ్ లో లక్నో
36 రన్స్ తో విజయం సాధించింది.

Exit mobile version