KL Rahul: టీమిండియా క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తదుపరి టోర్నమెంట్ కోసం సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ 2023 లో ఆర్సీబీతో ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు మైదానంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు సెప్టెంబర్‌లో శ్రీలంకలో జరిగే ఆసియా కప్‌లో పునరాగమనం చేయాలని రాహుల్ భావిస్తున్నాడు.
కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఐపీఎల్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. డాక్టర్ల సలహా మేరకు యూకేలో రాహుల్‌కు శస్త్రచికిత్స విజయవంతమైంది. దాంతో కేఎల్ రాహుల్ శిక్షణ కేంద్రానికి (NCA)తిరిగి వచ్చిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ಮನೆ 🏡 pic.twitter.com/0BXpG03kdL
— K L Rahul (@klrahul) June 13, 2023
వన్డే ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అదేవిధంగా వికెట్ కీపర్ గానూ కొనసాగుతున్నాడు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ లేకపోవడంతో జట్టులో కేఎల్ రాహుల్ అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన రికార్డ్స్ నెలకొల్పాడు. 47 టెస్టుల్లో 2 వేల 642 పరుగులు, 54 వన్డేల్లో 1,986 పరుగులు, 72 టీ20ల్లో 2,265 పరుగులు చేశాడు. వివిధ ఫార్మాట్లలో 14 సెంచరీలు సాధించాడు.