KL Rahul: టీమిండియా స్క్వాడ్‌లో హైలైట్స్ ఇవే.. కేఎల్ రాహుల్‌కు ద‌క్క‌ని చోటు..!

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా జ‌ట్టును ప్రకటించింది.

  • Written By:
  • Updated On - April 30, 2024 / 04:39 PM IST

KL Rahul: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా జ‌ట్టును ప్రకటించింది. బోర్డు కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించగా, హార్దిక్ పాండ్యా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే కేఎల్ రాహుల్ (KL Rahul)పై బోర్డు విశ్వాసం వ్యక్తం చేయకపోవడంతో ఈ ఆట‌గాడి జట్టులో చోటుద‌క్క‌లేదు. కేఎల్ రాహుల్ ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. త‌న జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ను విజ‌యాల బాట‌లో న‌డిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024 పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో ప్ర‌స్తుతం ఐదో స్థానంలో ఉంది. రాహుల్ నాయ‌క‌త్వంలోని ల‌క్నో 9 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజ‌యం సాధించ‌గా.. మ‌రో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే బీసీసీఐ సెల‌క్ట‌ర్లు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌టంపై టీమిండియా ఫ్యాన్స్ బీసీసీఐపై విమ‌ర్శలు చేస్తున్నారు.

అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న కేఎల్‌ను ఎందుకు జ‌ట్టులోకి తీసుకోలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాహుల్ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ కూడా అద్భుతంగా చేయ‌గ‌ల‌డ‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ లో పేల‌వ‌మైన ఫామ్‌లో ఉన్న పాండ్యాను బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా నియ‌మించింది. కేఎల్ రాహుల్‌తో పాటు ఈ ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణిస్తున్న కొంద‌రి ఆట‌గాళ్ల‌కు కూడా సెల‌క్ట‌ర్లు మొండిచేయి చూపారు. అయితే ఈ టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో స్థానం పొందిన గిల్‌, రింకూ సింగ్ మెయిన్ జ‌ట్టులో లేరు. రిజ‌ర్వ్ ప్లేయ‌ర్ల స్థానంలో ఉన్నారు. ఖలీలీ అహ్మద్, అవేశ్ ఖాన్‌లు టీమ్ ఇండియాతో రిజర్వ్ ప్లేయర్‌లుగా అమెరికా, వెస్టిండీస్‌లకు వెళ్లనున్నారు.

Also Read: India Squad: టీ20 ప్రపంచ క‌ప్‌.. టీమిండియా స్క్వాడ్‌ వ‌చ్చేసింది.. ప్లేయ‌ర్స్ వీరే..!

కొన్నేళ్లుగా అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న చాహ‌ల్‌కు జ‌ట్టులో చోటు కల్పించారు. చాహ‌ల్‌తో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో ఆల్‌రౌండ‌ర్ పాత్ర పోషిస్తున్న శివ‌మ్ దూబేకు కూడా జ‌ట్టులో అవ‌కాశం క‌ల్పించారు. ఈ ఇద్ద‌రితో పాటు గ‌త ఏడాదిన్న‌ర పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చిన పంత్‌కు కూడా జ‌ట్టులో చోటు ద‌క్కింది. అయితే ఐపీఎల్ 2024లో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న అభిషేక్ శ‌ర్మ‌, శ‌శాంక్ సింగ్‌, తిల‌క్ వ‌ర్మ‌, అశుతోష్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్, గైక్వాడ్‌ల‌కు బీసీసీఐ అధికారులు మొండిచేయి చూపారు.

We’re now on WhatsApp : Click to Join

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC ) టీ20 ప్రపంచ కప్ 2024 కోసం అన్ని జట్లను ప్రకటించడానికి మే 1 తేదీ వ‌ర‌కు అవ‌కాశం ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నాయి. ఈరోజే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, టీమిండియా జ‌ట్ల‌ను ఆయా దేశాల సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు. జూన్ 1వ తేదీ నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే.