Site icon HashtagU Telugu

IPL 2022 : రాహుల్, స్టోయినిస్‌కు బిగ్ షాక్

Kl Rahul

Kl Rahul

ఐపీఎల్‌ 2022లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 18 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. ఈ మ్యాచ్ లో గెలుపొందిన ఆర్సీబీ టీం పాయింట్ల పట్టికలో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. అలాగే ఈ మ్యాచ్ లో ఓటమిపాలైన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇదిలాఉంటే అసలే ఓటమి బాధలో ఉన్న లక్నో జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ రూల్స్ ను అతిక్రమించిన కారణంగా లక్నో కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్‌ పాలకమండలి తెలిపింది.

ఐపీఎల్ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద కేఎల్‌ రాహుల్‌ లెవల్‌-1 నిబంధన అతిక్రమించినట్లు తేలింది. ఇక కేఎల్ రాహుల్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో నిబంధనల ప్రకారం అతని మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించారు. అలాగే ఈ మ్యాచ్ లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆలిరౌండర్ మార్కస్‌ స్టోయినిస్‌ కూడా రూల్స్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో వైడ్‌ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగి ఐపీఎల్‌ లెవెల్‌-1 రూల్ బ్రేక్ చేశాడు. దాంతో ఐపీఎల్ పాలమందలి మరోసారి ఇలాంటి తప్పు చేయొద్దని మార్కస్ స్టోయినిస్‌ను హెచ్చరించింది.
ఇక అంతకుముందు కూడా లక్నో జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా 12 లక్షల ఫైన్ ఎదుర్కొన్నాడు. ఈ మెగా ట్రోనిలో మరో రెండుసార్లు కూడా కెఎల్ రాహుల్‌ స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదానికి పాల్పడితే అతనిపై ఒక మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశం ఉంది.