Zimbabwe Tour : జింబాబ్వేతో వన్డే సిరీస్…జట్టును ప్రకటించిన బీసీసీఐ…కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!!!

ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మొదలు కానున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చారు.

Published By: HashtagU Telugu Desk
KL Rahul

KL Rahul

ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మొదలు కానున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చారు. అంతేకాదు ఈ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా రాహుల్ సెలక్ట్ చేస్తూ బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఆతిథ్య జట్టులో మూడు వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించునున్నాడు. సిరీస్ లో మూడు వన్డేలు జింబాబ్వేలోని హరారేలో జరగనున్నాయి.

కాగా ఈ సిరీస్ కు సంబంధించి భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో బరిలోకి దిగనున్న భారత జట్టులో శిఖర్ ధావన్ తోపాటు రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ లు ఉన్నారు.

  Last Updated: 11 Aug 2022, 09:25 PM IST