Site icon HashtagU Telugu

KL Rahul Century: ఫేవరెట్ టీమ్ శతక్కొట్టిన కెఎల్ రాహుల్

Rahul Imresizer (1)

Rahul Imresizer (1)

ఐపీఎల్ 15వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో రెండో శతకాన్ని సాధించాడు. తాను నిలకడగా రాణించే ముంబై ఇండియన్స్ జట్టుపై రాహుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆరంభంలో కాసేపు నిదానంగానే ఆడినా క్రమంగా బ్యాట్ కు పని చెప్పిన రాహుల్ ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ముంబై ఇండియన్స్‌పై అత్యధిక హాఫ్ సెంచరీ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు సురేష్ రైనా 7 సార్లు ముంబై ఇండియన్స్‌పై 50+ స్కోర్లు నమోదు చేయగా డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, మనీశ్ పాండే, శిఖర్ ధావన్ ఆరేసి సార్లు ఈ ఫీట్ సాధించారు. మెడరిత్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెఎల్ రాహుల్‌కి ఐపీఎల్‌లో ఇది నాలుగో సెంచరీ. క్రిస్ గేల్ 6 ఐపీఎల్ సెంచరీలతో, విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో కెఎల్ రాహుల్ కంటే ముందున్నారు. అలాగే ఈ సీజన్ లో ఇది రెండో శతకం. 62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై జట్టుపై రాహుల్ కు ఇది రెండో శతకం.

రాహుల్ ఇన్నింగ్స్ కారణంగానే లక్నో మంచి స్కోర్ సాధించగలిగింది. ఈ శతకంతో పలు రికార్డులు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 4 అంత కంటే ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీ తర్వాత స్థానంలో నిలిచాడు. అలాగే టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ళ జాబితాలో రోహిత్ సరసన నిలిచాడు. రోహిత్ శర్మ 6 సెంచరీలు చేయగా… ఇప్పుడు రాహుల్ కూడా 6 శతకాలతో దానిని సమం చేశాడు. కోహ్లీ 5 సెంచరీలతో , రైనా 4 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడిన కెఎల్ రాహుల్ 368 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Exit mobile version