KKR vs SRH: కోల్‌కతపై హైదరాబాద్ దే ఆధిపత్యం

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ తలపడగా ఈవెనింగ్ కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతుంది.

KKR vs SRH: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ తలపడగా ఈవెనింగ్ కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతుంది.

గత సీజన్‌లో ఈ రెండూ జట్లు తీవ్రంగా నిరాశాపరిచాయి. కోల్‌కత నైట్ రైడర్స్ ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చిట్టచివరణ నిలిచింది. లీగ్స్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లల్లో నాలుగంటే నాలుగు మాత్రమే గెలిచింది కోల్‌కత ఆడిన ఎనిమిదింట్లో ఆరు మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచింది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితులు పునరావృతం కాకపోవచ్చు. ఎందుకంటే చెరో జట్టులో ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్లను చేర్చుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను 24.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. స్టార్క్ తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి వస్తుండటంతో కేకేఆర్ అభిమానులు టైటిల్ పై ఆశలు పెంచుకున్నారు.

ఈ సారి కోల్కతా తరుపున రింకు సింగ్ మెరుపులు చూడొచ్చు. ఇటీవల జరిగిన టి20 మ్యాచ్ లో రింకు సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక ఐపీఎల్ లో రింకు బ్యాట్ కు పని చెప్తే బౌలర్లకు చిక్కులు తప్పవు. మరోవైపు కోల్‍కతా నైట్ రైడర్స్ కెప్టెన్‍గా శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ ఇచ్చాడు. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్‍కు శ్రేయస్ దూరం కాగా, కేకేఆర్‌కు నితేశ్ రాణా కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. శ్రేయాస్ రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్‌ను 20.25 కోట్లకు కొనుగోలు చేసింది. కమిన్స్ గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. దీంతో కమిన్స్ పై జట్టు ఓనర్ కావ్య మారన్ భారీగా ఆశలు పెట్టుకుంది. కమిన్స్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి కప్ కొట్టాలని ఫ్రాంచైజీ భావిస్తుంది.

జట్టులో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మలిక్ వంటి టీ20 స్పెషలిస్టు పేసర్లు జట్టులో ఉండటంతో హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తుంది. అలాగ ప్రపపంచకప్ హీరో ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్ బాధ్యత తీసుకోనున్నారు. వీళ్లంతా కాళికట్టుగా ఏకమై ఆడితే విజయం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. అయితే వనిందు హసరంగ తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడం కాస్తా ఎఫెక్ట్ పడొచ్చు. కాగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటివరకు 25 సార్లు తలపడగా ఎస్‌ఆర్‌హెచ్‌ పైచేయిగా సాధించింది. ఎస్ఆర్‌హెచ్ 16 మ్యాచ్‌లు గెలవగా.. కోల్‌కతా తొమ్మిది విజయాలు దక్కించుకుంది.

Also Read: Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ