KKR vs SRH: ఐపీఎల్ 2025లో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH), సన్‌రైజర్స్ హైదరాబాద్ (KKR vs SRH) మధ్య 15వ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఇప్పటివరకు రెండు జట్ల ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. రెండు జట్లు ఇప్పటివరకు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 2 మ్యాచ్‌లలో ఓడిపోయి, చెరో మ్యాచ్‌లలో గెలిచాయి. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చవిచూసింది. సన్‌రైజర్స్ తమ గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాట్ కమిన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేయవచ్చని తెలుస్తోంది. ఈడెన్ గార్డెన్స్ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని కమిన్స్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు వస్తున్నాయి.
రాహుల్ చాహర్‌కు అవకాశం లభించవచ్చు
స్పిన్ బౌలర్ రాహుల్ చాహర్‌కు ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. సన్‌రైజర్స్ తరపున ఇప్పటివరకు ఇద్దరు స్పిన్ బౌలర్లు ఆడమ్ జంపా, జీషాన్ అన్సారీ ఆడారు. అంతేకాకుండా పార్ట్-టైమ్ బౌలర్‌గా అభిషేక్ శర్మ కూడా కొంత బౌలింగ్ చేశాడు. ఇప్పుడు KKRతో జరిగే మ్యాచ్‌లో రాహుల్ చాహర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వవచ్చు. రాహుల్ ఇప్పటివరకు 78 మ్యాచ్‌లలో 75 వికెట్లు తీశాడు.
మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడమ్ జంపా ఆడాడు. కానీ అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2 మ్యాచ్‌లలో జంపా కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో వియాన్ ముల్డర్‌కు అవకాశం ఇచ్చారు. కానీ అతని ప్రదర్శన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. వియాన్‌కు కేవలం 1 ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం లభించింది, దీనిలో అతను 16 పరుగులు ఇచ్చాడు.
KKRతో మ్యాచ్‌లో SRH ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్\ జీషాన్ అన్సారీ.