Virat Kohli: ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ RCB.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కింగ్ కోహ్లీ (Virat Kohli) చాలా కాలం తర్వాత ఈ మైదానంలో సందడి చేయడం కనిపిస్తుంది. విరాట్‌కు ఈడెన్ గార్డెన్స్ మైదానం చాలా ఇష్టం. విరాట్ KKR హోమ్ గ్రౌండ్‌పై అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మొదటి మ్యాచ్‌లో కోహ్లీ నుండి ఓ మంచి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.
ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ ప్రదర్శన
విరాట్ కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో మొత్తం 13 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ 37.10 సగటు, 130 స్ట్రైక్ రేట్‌తో 371 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ కోల్‌కతా హోమ్ గ్రౌండ్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అయితే కోహ్లీ ఒకసారి సున్నా వద్ద కూడా పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బౌలింగ్ దాడిని విరాట్ సమర్థవంతంగా ఎదుర్కొగలడు.
ఈ మైదానంలో కోల్‌కతాపై కోహ్లీ 11 ఇన్నింగ్స్‌ల్లో 346 పరుగులు చేశాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సందడి చేయడం ద్వారా విరాట్ తన కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందాడు. కాబట్టి టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే కోహ్లీ తనదైన ఆటతో అభిమానులు అలరించనున్నాడు.
KKRపై విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉంది?
IPLలో KKRపై విరాట్ కోహ్లీ రికార్డు బలంగా ఉంది. కోహ్లీ మొత్తం 34 మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో అతను 38 సగటుతో 962 పరుగులు చేశాడు. RCB దిగ్గజ బ్యాట్స్‌మన్ KKRపై ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. IPL 2024లో విరాట్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 61 సగటుతో 154 స్ట్రైక్ రేట్‌తో 741 పరుగులు చేశాడు. విరాట్ ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇకపోతే ఐపీఎల్ 18వ సీజన్ ఎల్లుండి మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది.