KKR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs CSK)ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ కేకేఆర్‌కి ప్లేఆఫ్‌ల దృష్ట్యా చాలా కీలకమైనది. ఈ మ్యాచ్‌లో KKR మొదట బ్యాటింగ్ చేసి 179 పరుగులు చేసింది. దీనికి బదులుగా CSK చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్లు మిగిలి ఉండగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు 180 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి బదులుగా CSKకి చాలా దారుణమైన ఆరంభం లభించింది. ఎందుకంటే ఇద్దరు ఓపెనర్లు ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వే కూడా సున్నా స్కోర్‌తో ఔట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో తన IPL అరంగేట్రం చేసిన ఉర్విల్ పటేల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. అతను 31 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు.
Also Read: Team India Test Captain: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు? రేసులో ఉన్నది ఎవరు?
CSK టీమ్ మేనేజ్‌మెంట్ రవిచంద్రన్ అశ్విన్‌ను నాల్గవ స్థానంలో పంపి పెద్ద రిస్క్ తీసుకుంది. కానీ అది విఫలమైంది. ఎందుకంటే అశ్విన్ కేవలం 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజాకు ఆరంభం లభించినప్పటికీ 10 బంతుల్లో 19 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు CSK జట్టు సగం 60 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరింది.
శివమ్ దుబే, డెవాల్డ్ బ్రెవిస్ కీలక భాగస్వామ్యం
చెన్నై జట్టు సగం 60 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ శివమ్ దుబే, డెవాల్డ్ బ్రెవిస్ 67 పరుగుల భాగస్వామ్యంతో ఈ కష్టం నుంచి జట్టును బయటపడేశారు. బ్రెవిస్ కేవలం 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 4 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు. మరోవైపు శివమ్ దుబే 40 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోనీ, శివమ్ దుబేతో కలిసి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టు విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. శివమ్ దుబే 19వ ఓవర్‌లో 45 పరుగులతో ఔట్ అయ్యాడు, ధోనీ 18 బంతుల్లో 17 పరుగులతో నాటాట్‌గా నిలిచాడు.