Site icon HashtagU Telugu

KKR: కేకేఆర్ విడుదల చేయనున్న ఆటగాళ్ల ధ‌ర ఎంతో తెలుసా?

KKR

KKR

KKR: ఐపీఎల్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ఐపీఎల్ 2025 సీజన్ నిరాశపరిచింది. జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ప్లేఆఫ్స్‌లో కూడా చోటు సంపాదించలేకపోయింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ ముందు కేకేఆర్ ఆరుగురు స్టార్ ఆటగాళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ ఆటగాళ్ల ఐపీఎల్ జీతం మొత్తం రూ. 40.65 కోట్లుగా ఓ నివేదిక పేర్కొంది.

కేకేఆర్ విడుదల చేయనున్న ఆటగాళ్లు

రాబోయే సీజన్ కంటే ముందు కేకేఆర్ జట్టులో పెద్ద మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఫ్రాంచైజీ విడుదల చేయాలనుకుంటున్నట్టు భావిస్తున్న ఆటగాళ్ల వివరాలు, వారి ఐపీఎల్ 2025 జీతం ఇక్కడ ఉంది.

Also Read: IPL 2026 Retention : CSK నుంచి జడ్డూ రిలీజ్. . స్పందించిన ఫ్రాంఛైజీ..!

ఈ ఆరుగురు ఆటగాళ్ల ఐపీఎల్ 2025 జీతం మొత్తం రూ.40.65 కోట్లు. ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం ద్వారా మెగా వేలంలోకి బలమైన వ్యూహంతో వెళ్లాలని కేకేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్సీని అజింక్య రహానే కొనసాగించవచ్చు

ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టారు. అయితే ఆ తర్వాత అతన్ని కేకేఆర్ విడుదల చేసింది. ఐపీఎల్ 2025 కోసం ఫ్రాంచైజీ అజింక్య రహానేను జట్టులోకి తీసుకొని అతన్ని కెప్టెన్‌గా నియమించింది. మరోవైపు విడుదలైన శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ తమ ఫ్రాంచైజీలో చేర్చుకొని కెప్టెన్‌గా నియమించింది. అంతకుముందు కేకేఆర్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో 2012, 2014 సంవత్సరాలలో రెండుసార్లు టైటిళ్లను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కేకేఆర్ తమ నాలుగో టైటిల్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రాబోయే సీజన్ కోసం కేకేఆర్ ఎలాంటి జట్టును సిద్ధం చేస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version