KKR- RCB: ఆర్సీబీ వ‌ర్సెస్ కేకేఆర్‌.. ఐపీఎల్‌లో నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు..!

ఈరోజు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR- RCB) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

  • Written By:
  • Updated On - March 29, 2024 / 09:24 AM IST

KKR- RCB: ఈరోజు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR- RCB) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అందుకే ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఇరు జట్లూ రంగంలోకి దిగనున్నాయి.

ఈ ఆటగాళ్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ‌రిలోకి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుంటే.. ఫాఫ్ డు ప్లెసిస్‌తో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఉండవచ్చు. దీని తర్వాత మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్, కెమెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ వంటి బ్యాట్స్‌మెన్‌లు ఉంటారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ బౌలర్లుగా అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, మయాంక్ దాగర్, యష్ దయాల్‌లు ఉండవచ్చు.

Also Read: Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం.. 12 ప‌రుగుల తేడాతో ఢిల్లీ ఓట‌మి..!

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయ‌ర్స్‌

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ శ్రేయాస్ అయ్యర్ చేతిలో ఉంటుంది. ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా, రమణదీప్ సింగ్ వంటి బ్యాట్స్‌మెన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కావచ్చు. అదే సమయంలో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ ఆల్ రౌండర్లుగా ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం అవుతారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ బాధ్యత హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్,యు వరుణ్ చక్రవర్తి భుజాలపై ఉంటుంది.

We’re now on WhatsApp : Click to Join

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జ‌ట్టు (అంచ‌నా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, మయాంక్ దాగర్, యశ్ దయాల్.

కోల్‌కతా నైట్ రైడర్స్ జ‌ట్టు (అంచ‌నా): శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి.