Site icon HashtagU Telugu

KKR vs RCB: హోం గ్రౌండ్ లో బెంగుళూరుకు మళ్లీ షాక్… ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన కోల్ కత్తా

Fan Reached Groom

Kkr Vs Rcb

KKR vs RCB: ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంత గడ్డపై రాయల్ చాలెంజర్స్ కు షాక్ ఇస్తూ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ కోల్ కత్తా అదరగొట్టింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. జాసన్ రాయ్, నారయణ్ జగదీషన్ ధాటిగా ఆడడంతో
పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ల జోరుకు విజయ్ కుమార్ వైశాఖ్ బ్రేక్ వేశాడు. ఒకే ఓవర్‌లో నారయణ్ జగదీషన్, జాసన్ రాయ్‌లను ఔట్ చేశాడు. తర్వాత వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా ఇన్నింగ్స్‌ కొనసాగించారు. నితీశ్ రాణా ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను బెంగుళూరు ఫీల్డర్లు వదిలేయడం కొంప ముంచింది.
ఈ అవకాశాలతో రాణా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ధాటిగా ఆడి 31 రన్స్ కు ఔట్ అయ్యాడు. చివర్లో రింకూ సింగ్ , డేవిడ్ వీస్ మెరుపులు మెరిపించారు. రింకూ సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా వరుసగా 6, 4, 4 బాదాడు. చివరి ఓవర్లో డేవిడ్ వీస్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో బెంగుళూరు 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.

భారీ టార్గెట్ ను చేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ , డుప్లేసిస్ 2.2 ఓవర్లలోనే 31 పరుగులు జోడించారు. మరింత ధాటిగా ఆడే క్రమంలో బెంగుళూరు వరుస వికెట్లు కోల్పోయింది. డుప్లేసిస్ 17, షాబాజ్ అహ్మద్ 2 , మాక్స్ వెల్ 5 రన్స్ కే వెనుదిరిగారు. అయితే కోహ్లీ , లొమ్రార్ ధాటిగా ఆడడంతో స్కోర్ వేగం తగ్గలేదు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

కోహ్లీ 37 బంతుల్లో 54 రన్స్ కు ఔట్ అవగా…లొమ్రార్ 34 రన్స్ చేశాడు. వీరిద్దరూ కీలక సమయంలో వెంట వెంటనే ఔట్ అవడంతో బెంగుళూరు ఓటమి ఖాయమైంది. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా నిరాశ పరిచాడు. చివరికి బెంగుళూరు 20 ఓవర్లలో 179 పరుగులే చేయగలిగింది. కోల్ కత్తా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, ఆండ్రూ రస్సెల్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత కోల్ కత్తా కు ఇదే తొలి విజయం.