Site icon HashtagU Telugu

FIFA WORLD CUP 2022: అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయం. సౌదీలో ఘనంగా వేడుకలు..దేశవ్యాప్తంగా సెలవు.!!

Saudi

Saudi

ఫిఫా వరల్డ్ కప్ 2022లో సౌదీ అరేబియా అర్జెంటినా జట్టును 2-1తేడాతో ఓడించింది. దీంతో సౌదీలో సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్జెంటినాపై విజయం సాధించామన్న ఆనందంలో మునిగిపోయారు కింగ్ సల్మాన్. దీంతో బుధవారం (నవంబర్ 23)న సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలకు అన్నింటికి వర్తిస్తుందని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.

అర్జెంటీనాపై గెలుపు తర్వాత జట్టు అభిమానులు సంబురాలు చేసుకున్నారు. దేవునికి ధన్యవాదాలు, ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా పట్టుదలతో ఆడారు. వారు అర్జెంటీనాను ఓడించారు. చాలా సంతోషంగా ఉందని సౌదీ అరెబియా విజయం తర్వాత అక్కడి అభిమానులు అన్నారు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి ఖతార్ కు వెళ్లిన ఫహద్ అల్ కనానీ అనే అభిమాని రెండో గోల్ తర్వాత మేము 4-1తో విజయం సాధించాలని కోరకున్నాం. కానీ గెలిచాం. చాలా సంతోషంగా ఉందని అని తెలిపాడు.

మొత్తానికి పసికూన సౌదీ చేతిలో ఓడిపోయిన అర్జెంటీనా…ఫిఫా ర్యాకింగ్స్ లో మూడో స్థానంలో నిలిచింది. అదే సమయంలో సౌదీ అరేబియా జట్టు 51వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచ కప్ చరిత్రలోనే గొప్పవిజయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచకప్ లో అర్జెంటీనా, మెక్సీకో, పోలాండ్ లతోపాటు సౌదీ అరేబియా గ్రూప్ సి లో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు సౌదీ రానున్న మ్యాచ్ లో మెక్సికో, పోలాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో సౌదీ రాణించినట్లయితే..నాకౌట్ కు చేరుకుంటుంది. ఇప్పుడు అర్జెంటీనాపై ఒత్తిడి పెరిగింది.