King Kohli: విరాట పర్వం మళ్లీ మొదలైంది.. కింగ్ కోహ్లీ రికార్డుల వేట..!

ఎవరు కొడితే రికార్డులు బద్దలవుతాయో అతనే విరాట్ కోహ్లీ.. గ్యాప్ రాలేదు ఇచ్చాడంతే.. ఈ రెండు డైలాగ్స్ కింగ్‌ కోహ్లీ (King Kohli)కి సరిగ్గా సరిపోతాయి.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 09:45 AM IST

King Kohli: ఎవరు కొడితే రికార్డులు బద్దలవుతాయో అతనే విరాట్ కోహ్లీ.. గ్యాప్ రాలేదు ఇచ్చాడంతే.. ఈ రెండు డైలాగ్స్ కింగ్‌ కోహ్లీ (King Kohli)కి సరిగ్గా సరిపోతాయి. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ రన్ మెషీన్‌గా పేరుతెచ్చుకున్న విరాట పర్వం మళ్లీ మొదలైంది. గ్యాప్ ఇచ్చినప్పుడు వచ్చిన విమర్శలకు కుంగిపోకుండా పడిలేచిన కెరటంలా అదరగొట్టేస్తూ ప్రపంచకప్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో మీ రికార్డులు బ్రేక్ చేసేది ఎవరనే ప్రశ్నకు 10 ఏళ్ళ క్రితం సచిన్ ఇచ్చిన సమాధానం ఇది.

ఫార్మాట్‌తో సంబంధం లేదు.. ప్రత్యర్థి బౌలర్లు ఎవరైనా లెక్క లేదు…పిచ్‌ ఎలా ఉన్నా… ఆడుతోంది ఎక్కడైనా క్రీజులోకి అడుగుపెడితే పరుగుల వరద పారాల్సిందే… మంచినీళ్ళు తాగినంత సులువుగా సెంచరీలు కొట్టడం అతనికే చెల్లింది…ఛేజింగ్‌లో మొనగాడిలా నిలబడి జట్టును గెలిపించడం అతనికి చాలా సింపుల్ విషయం.. అతనెవరో కాదు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ..ఒక ఏడాదిలో 10 శతకాలు సాధించిన కోహ్లీ… సెంచరీ కొట్టకుండా రెండున్నరేళ్లు ఉన్నాడంటే అందరికీ అది షాకే… ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఒడిదుడుకులు సహజం.. అయితే విరాట్ లాంటి ప్లేయర్‌ ఇలా ఇబ్బందిపడడం అభిమానులను బాధపెట్టింది. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి మళ్లీ బ్యాటింగ్‌పై పూర్తి ఫోకస్‌తో లోపాలు అధిగమించి ఫీనిక్స్ పక్షిలా పుంజుకున్నాడు.

Also Read: Records: రికార్డులతో హోరెత్తిన వాంఖడే స్టేడియం.. తొలి సెమీస్ లో నమోదైన రికార్డులు ఇవే..!

గత ఏడాది ఆసియాకప్‌లో ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీ తర్వాత విరాట పర్వం మళ్లీ మొదలైంది. సిరీస్‌ సిరీస్‌కూ తన ఫామ్ కొనసాగిస్తూ ప్రస్తుత పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది విరాటుని జోరు మామూలుగా లేదు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అయితే 10 మ్యాచ్‌లలో 101.57 సగటుతో 711 పరుగులు చేశాడు. దీనిలో మూడు సెంచరీలున్నాయి. ముఖ్యంగా సెమీస్‌లో కివీస్‌పై సాధించిన శతకంతో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టెండూల్కర్ రికార్డునూ దాటేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

2019 తర్వాత కెరీర్‌లోనే అత్యంత గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాడు కోహ్లీ.. ఇక రిటైర్మెంటే మిగిలిందన్న వ్యాఖ్యలూ వినిపించాయి. ఇలాంటి వ్యాఖ్యలను నిజం చేస్తే అతను కోహ్లీ ఎందుకవుతాడు..ఈ కామెంట్స్ చేసిన వారికి బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ వరల్డ్‌కప్‌లో అతనే లీడింగ్ రన్ స్కోరర్‌.. కింగ్ కోహ్లీ ఇదే జోరు కొనసాగిస్తే వరల్డ్‌కప్‌ కోసం 12 ఏళ్లుగా అభిమానుల నిరీక్షణకు తెరపడినట్టే.