Virat Kohli: కింగ్ ఈజ్ కింగ్, ఇండియా మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ స్టార్ లో కోహ్లీకి టాప్ ప్లేస్

స్పోర్ట్స్ స్టార్స్ లిస్ట్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

Virat Kohli

Virat Kohli: సెప్టెంబరు 2023కి సంబంధించిన ఓర్మాక్స్ స్పోర్ట్స్ స్టార్స్ లిస్ట్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కోహ్లి తిరుగులేని చరిష్మా, అసాధారణమైన క్రికెట్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు అతని శాశ్వతమైన ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచాయి. కోహ్లీ ఆ తర్వాత ఆ స్థాయిలో మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ ఉన్నాడు. క్రికెట్ అభిమానుల్లో అతని ప్రభావం ఎప్పటిలాగే బలంగా ఉందని నిరూపించాడు. ఫుట్‌బాల్ సంచలనాలు క్రిస్టియానో ​​రొనాల్డో, లియోనెల్ మెస్సీలు కూడా తిరుగులేని ప్రజాదరణను సొంతం చేసుకున్నారు.

సచిన్ టెండూల్కర్ మరియు రోహిత్ శర్మ వరుసగా నాలుగు, ఐదవ స్థానాలను కైవసం చేసుకోవడంతో, భారత క్రీడాభిమానులు క్రికెట్ దిగ్గజాల పట్ల విపరీతమైన గౌరవాన్ని చూపుతూనే ఉన్నారు. ఒలంపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరియు ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధూ తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నారు.

ప్రజాదరణ పొందిన క్రీడాకారులు వీళ్లే

  1. విరాట్ కోహ్లీ
  2. ఎం.ఎస్. ధోని
  3. క్రిస్టియానో ​​రొనాల్డో
  4. సచిన్ టెండూల్కర్
  5. రోహిత్ శర్మ
  6. లియోనెల్ మెస్సీ
  7. నీరజ్ చోప్రా
  8. సునీల్ ఛెత్రి
  9. హార్దిక్ పాండ్యా
  10. పి.వి. సింధు
  Last Updated: 24 Oct 2023, 05:12 PM IST