Site icon HashtagU Telugu

Corona : కరోనా బారిన స్టార్ షట్లర్స్

Kidambi Srikanth

Kidambi Srikanth

ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు. దీంతో వీరందరినీ ఐసోలేషన్ కు తరలించినట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. వీరి డబుల్స్ పార్టనర్స్ సైతం టోర్నీ నుండి వైదొలిగారు. దీంతో వీరి ప్రత్యర్థులు నేరుగా తర్వాతి రౌండ్లకు అర్హత సాధించనున్నారు. వేరే క్రీడాకారులను తీసుకుని మ్యాచ్ లు ఆడించే పరిస్థితి ఇప్పుడు లేదని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోర్నీకి ముందు హైదరాబాద్ ఆటగాడు సాయిప్రణీత్ కు సైతం కరోనా సోకడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆటగాళ్ళందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బబూల్ లోనే ఉన్నప్పటకీ వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

టోర్నీలో మిగిలిన ఆటగాళ్ళందరికీ మళ్ళీ పరీక్షలు చేయనున్నారు. వారిలో ఎవరైన పాజిటివ్ గా తేలితే టోర్నీ నుండి తప్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే టోర్నీని కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి బీడబ్ల్యూఎఫ్ మాత్రం టోర్నీ నిర్వహణపై ఆశాభావంతో ఉంది. కాగా టోర్నీకి ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కూడా కోవిడ్ బారిన పడడంతో ఆ దేశం వైదొలిగింది. తాజాగా ఏడుగురు క్రీడాకారులకు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో మిగిలిన ప్లేయర్స్ ఆందోళన చెందుతున్నారు. వీరంతా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా వైరస్ సోకింది. టోర్నీ రద్దు చేయడంపై రానున్న రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

Exit mobile version