Khaleel Ahmed: ఇంగ్లాండ్ భూమిపై ఒక భారతీయ బౌలర్ తన బౌలింగ్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో 4 వికెట్లు తీసిన ఈ భారతీయ బౌలర్ ఇంగ్లాండ్ లయన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ధ్వంసం చేశాడు. ఇంగ్లాండ్‌లో తన స్వింగింగ్ బంతులతో ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అనధికారిక టెస్ట్ మ్యాచ్ రెండో రోజున తొలి వికెట్ల కోసం ఇబ్బంది పడిన భారత జట్టుకు ఖలీల్ అద్భుతమైన పునరాగమనం అందించాడు. ఖలీల్ అద్భుతమైన స్పెల్ కారణంగా ఇంగ్లాండ్ లయన్స్ జట్టు ఇప్పుడు పూర్తిగా బ్యాక్‌ఫుట్‌పై ఉంది. ఖలీల్‌కు మరోవైపు నుంచి అంశుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండేలు గొప్ప సహకారం అందించారు.
ఖలీల్ విధ్వంసం సృష్టించాడు
ఇండియా-ఎ సాధించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ లయన్స్‌కు ఆరంభం దక్కలేదు. 29 పరుగుల వద్ద తమ తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత టామ్ హేన్స్, ఎమిలియో గే సెంచరీ భాగస్వామ్యంతో రెండో వికెట్‌కు గట్టి పునాది వేశారు. హేన్స్ 54 పరుగులు చేసి ఔట్ కాగా.. ఎమిలియో 71 పరుగుల దృఢమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ స్పెల్ ప్రారంభమైంది. ఖలీల్ తన తొలి వికెట్‌గా జోర్డాన్ కాక్స్‌ను ఔట్ చేశాడు. 219 పరుగుల వద్ద ఇంగ్లాండ్ లయన్స్‌కు నాలుగో దెబ్బ తగిలింది.
Also Read: Rinku Singh- Priya Saroj: ఘనంగా రింకూ సింగ్- ప్రియా సరోజ్ నిశ్చితార్థం.. ఉంగరాల ధర ఎంతంటే?
నాలుగు ఓవర్లలో 4 వికెట్లు
స్కోర్‌బోర్డ్‌లో మరో నాలుగు పరుగులు జోడవగానే ఖలీల్ జట్టు కెప్టెన్ జేమ్స్ రీవ్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. జార్జ్ హిల్‌కు ఖాతా తెరిచే అవకాశం కూడా ఇవ్వకుండా భారతీయ ఫాస్ట్ బౌలర్ అతడిని సున్నాకి ఔట్ చేశాడు. క్రిస్ వోక్స్ ఇన్నింగ్స్ కూడా ఖలీల్ బంతితోనే ముగిసింది. వోక్స్‌ను 5 పరుగుల వద్ద ఖలీల్ పెవిలియన్‌కు పంపాడు. ఈ విధంగా నాలుగు ఓవర్లలోనే ఖలీల్ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.
219 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి బలంగా కనిపించిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టు, 229 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది. ఇంతకుముందు ఇండియా-ఎ తరఫున కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 116 పరుగుల గొప్ప ఇన్నింగ్స్ ఆడగా.. ధ్రువ్ జురెల్ 52 పరుగులు చేశాడు. దీంతో జట్టు 348 పరుగులు సాధించడంలో విజయవంతమైంది.