IND vs ENG 2nd Test: సొంత గడ్డపై హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ ముగిసింది. తొలి ఇన్నింగ్‌లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్‌లో బ్యాటర్ల తడబాటుకు గురయ్యారు. కేవలం 230 పరుగులను ఛేదించేందుకు టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా 202 వద్దే ఆలౌట్ అయింది. పైగా ఓలీ పోప్ అద్భుత ఇన్నింగ్స్ భారత్ ను భారీ దెబ్బ కొట్టింది. దీంతో భారత్ పై ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో రోహిత్ సేన కచ్చితంగా గెలుస్తుందన్న ధీమా వ్యక్తమవుతోంది. ఎందుకంటే వైజాగ్‌లో టీమిండియా ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ ఓడిపోలేదు. విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ , పుజారా చెలెరిగిపోయారు. ఈ స్టార్ బ్యాటర్స్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఇప్పుడు వైజాగ్ లో రెండో టెస్టుకు ఈ ఇద్దరు ఆడకపోవడం రోహిత్ సేనకు ఎదురుదెబ్బ లాంటిదే. ఇక 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది. ఈ సారి టీమిండియా 203 భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. సో వైజాగ్ లో విన్నింగ్ ఫ్రీక్ ని కొనసాగించాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రోహిత్ సేన వైజాగ్ లో అడుగుపెట్టింది.
ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. బుమ్రా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, మరో పేసర్ సిరాజ్ మాత్రం తేలిపోయాడు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన సిరాజ్ 11 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక విశాఖ టెస్టును గెలిపించాల్సిన భారం బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్, బౌలింగ్ లో అశ్విన్, బుమ్రా పైనే ఉంది. రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే మిగతా బ్యాట్స్ మెన్లలో విశ్వాసం పెరుగుతుంది. యువ శుభ్ మన్ గిల్ ఫామ్ గొప్పగా లేదు. రజత్ పటీదార్ లేదా సర్ఫరాజ్ ఇద్దరూ కొత్తవారే. ఇక భారీ ఆశలు పెట్టుకున్న శ్రేయస్ అయ్యర్ ఇటీవల నిరాశపరుస్తున్నాడు. గత కొన్ని ఇన్నింగ్స్ లలో అయ్యర్ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో రోహిత్ చెలరేగాల్సిన అవసరం ఉంది.
Also Read: AP Special Status : ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చిన జేడీ