Ambati Rayudu joker: అంబటి రాయుడిని వదిలేయండి ప్లీజ్.. పీటర్సన్ రిక్వెస్ట్

ఐపిఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ చిట్ చాట్ సందర్భంగా కెవిన్ పీటర్సన్ అంబటి రాయుడిని జోకర్ అని పిలిచాడు. తదనంతరం భారత అభిమానులు సోషల్ మీడియాలో అంబటి రాయుడిని టార్గెట్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ambati Rayudu joker

Ambati Rayudu joker

Ambati Rayudu joker: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడిని జోకర్ గా సంబోధించడం వైరల్ గా మారింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడగా కేకేఆర్ విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచింది.

ఐపిఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ చిట్ చాట్ సందర్భంగా కెవిన్ పీటర్సన్ అంబటి రాయుడిని జోకర్ అని పిలిచాడు. తదనంతరం భారత అభిమానులు సోషల్ మీడియాలో అంబటి రాయుడిని టార్గెట్ చేస్తున్నారు. అంతకుముందు రాయుడు విరాట్ కోహ్లీపై కామెంట్స్ చేయడం తెలిసిందే. దీని కారణంగా అభిమానులకు రాయుడిపై కోపంగా ఉన్నారు. ఇక తాజాగా పీటర్సన్ చేసిన జోకర్ కామెంట్స్ తరువాత రాయుడిని మరింత టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దీనిపై పీటర్సన్ స్పందించడం విశేషం.

పీటర్సన్ ట్వీట్ చేస్తూ అంబటి రాయుడిని టార్గెట్ చేయవద్దంటూ ఫ్యాన్స్ ను విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత రాయుడు, నేనూ సరదాగా మాట్లాడుకున్నామని, అకస్మాత్తుగా ఆ జోక్ అంబటిపై వ్యతిరేకంగా టర్న్ తీసుకుందనిచెప్పాడు. ఈ సమయంలో ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదన్నాడు పీటర్సన్. దయచేసి ట్రోలింగ్ ఆపాలని కోరారు.

ఆరెంజ్ క్యాప్ తో ఎవరూ టైటిల్ గెలవలేరంటూ పరోక్షంగా విరాట్ కోహ్లీపై కామెంట్స్ చేశాడు అంబటి రాయుడు. జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ రాణిస్తేనే టైటిల్ దక్కుతుందంటూ అంబటి కోహ్లీని ఉద్దేశించి సెటైరికల్ కామెంట్స్ చేశాడు. దీంతో అంబటి అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా ఈ సీజన్ ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 700కుపైగా పరుగులు సాధించాడు. తద్వారా ఆతను ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

Also Read: Rashmika Mandanna : రష్మిక ఏంటి.. ఆనంద్ దేవరకొండని అంత మాట అనేసింది..!

  Last Updated: 28 May 2024, 06:41 PM IST