Kedar Jadhav Retirement: అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్

ధోనీ తరహాలోనే కేదార్ జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను 'జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై' పాటతో తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.

Kedar Jadhav Retirement: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తరహాలో కేదార్ జాదవ్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు. 2020 ఆగస్టు 15న ఎంఎస్ ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లైన్ల ప్రకటనతో తన విడ్కోలును ప్రకటించాడు. మీ ప్రేమ మరియు మద్దతు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు, నేను రాత్రి 7.29 నుండి రిటైర్ అయ్యాను అని ధోనీ ట్యాగ్ లైన్ జత చేశాడు. ఈ సమయంలో ధోని తన కెరీర్‌లోని కొన్ని మర్చిపోలేని చిత్రాల వీడియో ద్వారా పంచుకున్నాడు. అందులో అతనికి ఇష్టమైన పాట .. మైన్ పల్ దో పల్ కా షాయర్ హూన్’ అనే పాట వినగానే అభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. ధోనీ తరహాలోనే కేదార్ జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను ‘జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై’ పాటతో తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.

కేదార్ జాదవ్ 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతను 16 నవంబర్ 2014న రాంచీలో శ్రీలంకతో తన మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. చివరి వన్డే మ్యాచ్‌ని 8 ఫిబ్రవరి 2020న న్యూజిలాండ్‌తో ఆడాడు. కేదార్ మొత్తం 73 మ్యాచ్‌లు ఆడి వన్డేల్లో 1389 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలను చేశాడు. టీ20లో కేదార్ 9 మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో కేదార్ జాదవ్ మొత్తం 95 మ్యాచ్‌లు ఆడి 1208 పరుగులు చేశాడు, ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా వన్డేల్లో 73 మ్యాచుల్లో మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Phone Tapping Case : కీలక పరిణామం.. రాధాకిషన్ రావుకు బెయిల్.. కారణం అదే