Site icon HashtagU Telugu

Kavya Marriage : స‌న్ రైజ‌ర్స్ య‌జ‌మాని కావ్యా కు క్రికెట్ గ్రౌండ్ లో పెళ్లి ప్ర‌తిపాద‌న‌

Kavya Marriage

Kavya

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ సహ-యజమాని కావ్యా మారన్(Kavya Marriage) మీద ద‌క్షిణాఫ్రికా క్రికెట్ అభిమాని మ‌న‌సు ప‌డ్డాడు. ప్లే కార్డు ద్వారా క్రికెట్ గ్రౌండ్ (Ground) లోనే పెళ్లి ప్రతిపాద‌న చేశాడు. దీంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయింది. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. గుండె ఎమోజితో ఉన్న ఆ వీడియో కావ్యా మార‌న్ పెళ్లిపై చ‌ర్చ‌కు దారితీసింది.

సన్‌రైజర్స్ సహ-యజమాని కావ్యా మారన్(Kavya Marriage)

స‌న్ నెట్ వ‌ర్క్ య‌జ‌మాని క‌ళానిధి మార‌న్ కుమార్తె కావ్యా మార‌న్ (Kavya Marriage). సన్ రైజ‌ర్స్ కు స‌హ య‌జ‌మానిగా ప్ర‌తి మ్యాచ్ లోనూ గ్యాల‌రీ (Ground)లో క‌నిపిస్తుంటారు. ఆమె టీమ్ ను ఉత్సాహ‌ప‌రుస్తూ ప‌లు ర‌కాల విన్యాసాలు చేస్తూ కెమెరాకు అందంగా క‌నిపిస్తారు. ఆమె ఔత్సాహిక క్రికెట్ అభిమాని. ఐపీఎల్ మ్యాచ్ ల్లో క్రికెట్ టీమ్ ను ఉత్సాహ‌ప‌రుస్తుంటారు. 30ఏళ్ల ఆ బ్యూటీ ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలో ఉంది. అక్కడ ఆమె SA20 లీగ్ ప్రారంభ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సిస్ట‌ర్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మద్దతు ఇస్తుంది.

Also Read : Jr NTR Met India cricketers: టీమిండియా క్రికెటర్లను కలిసిన జూ. ఎన్టీఆర్

పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో కావ్యా టీమ్‌ పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సంద‌ర్భంగా దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమాని వివాహ ప్రతిపాదనను అందించాడు. అత‌ను ఆట చూసేందుకు స్టేడియానికి వచ్చాడు. పార్ల్ రాయల్స్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ముగిసిన తర్వాత, “కావ్యా మారన్, నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని రాసి ఉన్న బోర్డుని పట్టుకుని క‌నిపించాడు. ఆ దృశ్యం కెమెరా చిక్కింది. ఈ వీడియో లీగ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయబడింది. అప్పటి నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమె నెటిజ‌న్ల‌ దృష్టిని… 

కావ్య సన్‌రైజర్స్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేది. ఇటీవల డిసెంబర్ 23, 2022న కొచ్చిలో జరిగిన IPL 2023 మినీ వేలంలో కనిపించింది. వేలంపాటలతో పాటు, ఆమె జట్టు ఆడే మ్యాచ్‌లకు రెగ్యులర్ గా హాజరయ్యేది. మైదానంలో ఆమె ఉత్సాహభరితమైన ప్రతిచర్యలు ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుంటాయి. ఇటీవలి సంవత్సరాలలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమె నెటిజ‌న్ల‌ దృష్టిని బాగా ఆకర్షించింది.

 

 

Also Read : Former Indian cricketer: టీమిండియా మాజీ క్రికెటర్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్

పార్ల్ రాయల్స్‌పై అద్భుతమైన విజయానికి ముందు, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఆడిన మునుపటి రెండు మ్యాచ్‌లలో MI కేప్ టౌన్‌ను కైవసం చేసుకుంది. వారు తమ ఐదు మ్యాచ్‌లలో మూడింటిని గెలిచి 12 పాయింట్లు సాధించి ప్రిటోరియా క్యాపిటల్స్‌ కంటే వెనుకబడి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నారు. జనవరి 21న‌ జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో తలపడినప్పుడు సన్‌రైజర్స్ తమ విజయాల పరంపరను విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఆకట్టుకునే ఫామ్‌ను కొనసాగించి మరో విజయాన్ని అందుకోవాలని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది.

Exit mobile version