ఐపీఎల్ (IPL 2023) ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ళతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లకూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది..షారూఖ్ ఖాన్, నీతా అంబానీ, ప్రీతిజింతా ఇలా ఆయా ఫ్రాంచైజీ ఓనర్ల తమ తమ టీమ్స్ ను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అనగానే గ్లామర్ గాళ్, ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ గుర్తొస్తుంది. గత కొన్ని సీజన్లుగా టీమ్ వెంటే ఉంటూ స్టేడియంలో తన ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ పాపులర్ అయింది.
మ్యాచ్ ఓడినప్పుడు.. గెలిచినప్పుడు ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు 16వ సీజన్ లోనూ కావ్యా పాప సందడి మొదలైంది. అయితే ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ లోనే షాక్ తగిలింది. మినీ వేలం తర్వాత జట్టును బ్యాలెన్సింగ్ గా మార్చాను అనుకుంటున్న కావ్యామారన్ ను ఆ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. మ్యాచ్ ఆరంభంలో మంచి ఉత్సాహంతో కనిపించిన ఆమెను తమ చెత్త ఆటతో నిరుత్సాహానికి గురి చేసింది. తాజాగా ఈ మ్యాచ్ లో కావ్యా ఎక్స్ ప్రెషన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 13 కోట్లు పెట్టి కొన్ని హ్యారీ బ్రూక్ 13 రన్స్ కే ఔటవగా… వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా నిరాశపరిచాడు.
ఇక ఎప్పుడూ బౌలింగ్ నే నమ్ముకుని బరిలోకి దిగే సన్ రైజర్స్ కు బౌలర్లు కూడా షాకిచ్చారు. హోంగ్రౌండ్ లో మాత్రం పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంతో కావ్యా పాప దిగాలుగా కనిపించింది. బౌలర్లకు పోటీగా బ్యాటర్లు కూడా పేలవ ప్రదర్శనతో నిరుత్సాహానికి గురి చేశారు. ఏ ఒక్కరూ స్థాయికి తగినట్టు ఆడలేదు. అటు ఫ్యాన్స్ కూడా సన్ రైజర్స్ ప్రదర్శనతో నిరాశ చెందారు. ఈ టీమ్ తో ప్లే ఆఫ్స్ కు చేరడం కూడా కష్టమేనంటూ పెదవి విరుస్తున్నారు. అయితే కెప్టెన్ మర్క్ రమ్ రాకతో సన్ రైజర్స్ పుంజుకుంటుందని మరికొందరు ఆశతో ఉన్నారు.
Not a good outing for SRH so far. pic.twitter.com/1G9ppdbqqs
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023