Site icon HashtagU Telugu

SA20 2024: అంబరాన్నంటిన కావ్య పాప సంబరాలు

SA20 2024

SA20 2024

SA20 2024: కావ్యామారన్ గురించి తెలియని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు..ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ గా గ్రౌండ్ లో దగ్గరుండి ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కు బోలెడు ఫాలోయింగ్ ఉంది. సన్ రైజర్స్ మ్యాచ్ జరిగిన ప్రతీసారీ ఆమెను చూసేందుకే గ్రౌండ్ కు వచ్చే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆటగాళ్ల వేలంలోనూ, మ్యాచ్ జరిగినప్పుడు గ్రౌండ్ లోనూ ఎక్కడైనా కావ్యా ఉందంటే సందడే సందడి…ఇక మ్యాచ్ గెలిస్తేనే హడావుడి చేసే కావ్య తన టీమ్ టైటిల్ సొంతం చేసుకుంటే సంబరాలు మామూలుగా ఉంటాయా… సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ టైటిల్ ను వరుసగా రెండోసారి సన్ రైజర్స్ గెలవడంతో కావ్యా పాప సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ విజయం నేపథ్యంలో కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ కన్నా కావ్య పాపనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి సంబరాలు చేసుకుంది . బౌలింగ్‌లోనూ వికెట్లు తీసినప్పుడు పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేసింది. ప్రస్తుతం కావ్యమారన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విజయానందంలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన కావ్య మారన్ వరుసగా రెండు టైటిళ్లు గెలవడం చాలా సంతోషంగా ఉందని, తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడింది.

కాగా సన్ రైజర్స్ ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్స్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌ జెయింట్స్‌ 115 పరుగులకే కుప్పకూలింది.

Also Read: Baby In Oven : ఓవెన్‌లో పసికందును పెట్టిన తల్లి.. ఎందుకు ? ఏమైంది ?

Exit mobile version