kapil dev : దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా హెడ్ కోచ్‌పై మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంభీర్ కోచ్ కాదని, మేనేజర్ మాత్రమేనని అన్నారు. ఆటగాళ్లకు టెక్నికల్ సూచనలు ఇవ్వడం కంటే.. ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కోచ్‌ల ముఖ్య కర్తవ్యమని అన్నారు. తన దృష్టిలో కోచ్‌లు అంటే.. తనకు స్కూల్, కాలేజీలో నేర్పిన వారే అని చెప్పారు.
- గంభీర్ అసలు టీమిండియా కోచ్ కాదు.. మేనేజర్
- గౌతమ్ గంభీర్‌పై కపిల్ దేవ్ సంచలన కామెంట్స్
- కోచ్ అంటే అలా ఉండాలన్న కపిల్ దేవ్
ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. భారత్‌లో దాదాపు 25 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత వేళ్లన్నీ.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూపించాయి. ఈ ఓటమికి అతడే కారణమని.. వెంటనే హెడ్‌కోచ్ పోస్టు నుంచి తప్పుకోవాలని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అంతేకాకుండా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడిపోవడంతో విమర్శలు తీవ్రమయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ కూడా గౌతమ్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని.. ప్లేయర్ల మేనేజర్ అని అన్నాడు.
గురువారం డిసెంబర్ 18 ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC సెంటినరీ సెషన్‌లో కపిల్ దేవ్ మాట్లాడారు. ఈ రోజుల్లో కోచ్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. కోచ్ అనే పదాన్ని ఈ రోజుల్లో చాలా తేలికగా వాడుతున్నారు. గౌతమ్ గంభీర్ నిజంగా ఒక కోచ్ కాలేరు. ఆయన కేవలం జట్టుకు మేనేజర్‌గా ఉండగలరు. కోచ్ అంటే.. నాకు పాఠశాలలో, కాలేజీలో నేర్పిన వారే గుర్తుకొస్తారు. వాళ్లే నా కోచ్‌లు అని కపిల్ దేవ్ అన్నాడు. అంతేకాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు హెడ్ కోచ్ నుంచి టెక్నికల్ సూచనలు అవసరం లేదని కపిల్ చెప్పారు.
ఒకరు ఇప్పటికే లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్ అయినప్పుడు.. అలాంటి వారికి మీరు ఏం కోచింగ్ ఇస్తారు? గౌతమ్ గంభీర్.. ఒక లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కు ఎలా కోచింగ్ ఇస్తారు? అని కపిల్ దేవ్ ప్రశ్నించారు. దీనికి బదులుగా.. ఆటగాళ్ల వ్యక్తిత్వాలను మేనేజ్ చేయడం.. సరైన వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యమని కపిల్ తెలిపారు. వాళ్లు సాధించగలరని వాళ్లే నమ్మేలా చేయాలన్నారు. కాగా, ప్లేయర్లకు కంఫర్ట్, భరోసా ఇచ్చి.. మీరు ఇంకా బాగా చేయగలరు అని ఆత్మవిశ్వాసం పెంపొందిచాలని కపిల్ దేవ్ అన్నారు. తాను కోచ్‌ను ఇలాగే చూస్తానన్నారు.
సెంచరీ చేసిన వారితో డిన్నర్ చేయను..
ఈ సందర్భందగా తన నాయకత్వ శైలి గురించి చెప్పిన కపిల్ దేవ్.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడానికి తాను ప్రయత్నించానని చెప్పారు. ఎవరైనా సెంచరీ చేస్తే.. తాను వారితో డిన్నర్ చేయాల్సిన అవసరం లేదని.. ప్రదర్శన సరిగా చేయని వారితో సమయం గడపడానికి తాను ఇష్టపడతానన్నారు. సరిగా ఆడని ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెంపొందిచడం జట్టు విజయంలో కీలకం అని అన్నారు. కోచ్‌ల ప్రధాన కర్తవ్యం ఆటగాళ్లకు సాంకేతిక విషయాలు నేర్పడం కంటే.. వారకి ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించి.. సపోర్టివ్ ఎన్విరాన్‌మెంట్ సృష్టించడమే అన్నారు.
