New Zealand: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్

న్యూజిలాండ్ (New Zealand) కెప్టెన్, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ (Williamson) ఆ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో స్టార్ బౌలర్ టిమ్ సౌథీ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విలియమ్సన్ ఉన్నట్టుండి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • Written By:
  • Updated On - December 15, 2022 / 07:11 AM IST

న్యూజిలాండ్ (New Zealand) కెప్టెన్, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ (Williamson) ఆ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో స్టార్ బౌలర్ టిమ్ సౌథీ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విలియమ్సన్ ఉన్నట్టుండి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో విలియమ్సన్ న్యూజిలాండ్‌ (New Zealand)ను విజేతగా నిలిపాడు.

వెటరన్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కొత్త టెస్టు కెప్టెన్‌గా నియమితులు కాగా.. విలియమ్సన్ గైర్హాజరీలో అంతర్జాతీయ స్థాయిలో కూడా కెప్టెన్‌గా వ్యవహరించిన టామ్ లాథమ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టిమ్ సౌథీ 346 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 22 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టిమ్ సౌథీ న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు 31వ టెస్టు కెప్టెన్‌గా అవతరించనున్నాడు.

టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై విలియమ్సన్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి ఇదే సరైన సమయం. నేను టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప అవకాశం. టెస్ట్ క్రికెట్ అత్యున్నత శ్రేణిలో ఉంది. దానికి కెప్టెన్‌గా వ్యవహరించే సవాలును నేను ఆనందించాను. కెప్టెన్‌గా పని, పనిభారం పెరుగుతుంది. నా కెరీర్‌లో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని భావించాను అని తెలిపాడు.

Also Read: FIFA World Cup 2022: వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్

2016లో బ్రెండన్ మెక్ కల్లమ్ తర్వాత కేన్ విలియమ్సన్ టెస్టు కెప్టెన్సీని చేపట్టాడు. విలియమ్సన్ 38 సార్లు జట్టుకు సారథ్యం వహించాడు. అందులో జట్టును 22 సార్లు గెలిపించాడు. 8 సార్లు డ్రా చేశాడు. విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదటి ఎడిషన్‌ను భారత్‌ను ఓడించి గెలుచుకుంది.