Kane Williamson: టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విలియమ్సన్‌..?

  • Written By:
  • Updated On - June 19, 2024 / 09:53 AM IST

Kane Williamson: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా కొనసాగి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు కివీస్‌ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా విలియమ్సన్ సెంట్రల్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి కూడా నిరాకరించాడని వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ లీగ్ మ్యాచ్‌లలో పేలవమైన ప్రదర్శనతో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ జట్టు ప్రపంచకప్ నుండి నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఈసారి కివీస్ జట్టు సూపర్-8లోకి కూడా చేరలేకపోయింది. దీని తర్వాత విలియమ్సన్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సమాచారం ఇచ్చింది

ఈ సమాచారాన్ని ఆ దేశ క్రికెట్‌ బోర్డు తెలిపింది. 2024-25 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి కేన్ విలియమ్సన్ నిరాకరించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. న్యూజిలాండ్ తరఫున 350కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవజ్ఞుడైన ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంట్రల్ కాంట్రాక్ట్, ODI-T20 జట్ల కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే టెస్టుల్లో విలియమ్సన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Also Read: Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్‌ రేసు.. గౌతమ్‌ గంభీర్‌కి పోటీగా డబ్ల్యూవీ రామన్‌..!

కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణమేంటి?

కేన్ విలియమ్సన్ ఈ సంవత్సరం చాలా తక్కువ క్రికెట్, T20 లీగ్ ఆడే అవకాశం వచ్చింది. మరోవైపు గాయం కారణంగా కేన్‌ కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అందుకే ఈ సీజన్‌లో కాంట్రాక్ట్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఎందుకంటే ఇప్పుడు జట్టులో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే యువ ఆటగాళ్లు ఉన్నారు. అందుకే ఈ స్థానాన్ని సులభంగా కైవసం చేసుకోవడం కేన్ ఇష్టపడటం లేదని వార్తలు వస్తున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

వన్డే, టీ20ల్లో కెప్టెన్‌ ఎవరు?

కేన్ విలియమ్సన్ చాలా కాలం పాటు వన్డే, టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ జట్టుకు త్వరలో కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. అయితే ఇప్పుడు కివీస్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ ఎవరన్న ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.