Site icon HashtagU Telugu

ICC Test Rankings: టెస్టు క్రికెట్‌లో మొదటి ర్యాంక్ సాధించిన కేన్ విలియమ్సన్

ICC Test Rankings

New Web Story Copy 2023 07 05t165056.420

ICC Test Rankings: టెస్టు క్రికెట్‌లో జో రూట్ స్థానాన్ని ఆక్రమించాడు కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదే సమయంలో యాషెస్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ ఆడిన స్టీవ్ స్మిత్ నాలుగు స్థానాలు ఎగబాకాడు.

యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ బాదిన జో రూట్ ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అయితే రూట్ తన నంబర్ వన్ స్థానాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయాడు. రెండో టెస్టులో రూట్ మొదటి ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మరియు రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే రాబట్టాడు. దీంతో జో రూట్ ఐదవ స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేశాడు. క్రికెట్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో విలియమ్సన్ ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ తాజా ర్యాంకింగ్స్‌లో సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. లార్డ్స్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మిత్ ఈ ఫీట్ సాధించాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో ప్రపంచంలోనే నంబర్ టూ బ్యాట్స్‌మెన్‌గా మారాడు. కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో ఆరోసారి నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. విలియమ్సన్ 2015లో తొలిసారిగా ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. కివీ మాజీ కెప్టెన్ 2021 సంవత్సరం వరకు క్రికెట్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగించాడు.

Read More: Sreemukhi : థాయ్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున శ్రీముఖి..

Exit mobile version