Kagiso Rabada: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండవ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించిన కగిసో రబడా (Kagiso Rabada) రెండవ ఇన్నింగ్స్‌లో కూడా తన మాయాజాలాన్ని చూపించాడు. రబడా ఒకే ఓవర్‌లో ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్‌లను పెవిలియన్‌కు పంపాడు. అలాగే రెండవ స్పెల్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను స్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న ఆలెక్స్ కేరీ (43 పరుగులు) పరుగుల ఇన్నింగ్స్‌ను కూడా ముగించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 4 వికెట్లు తీసిన రబడా. దిగ్గజాల ఎలైట్ క్లబ్‌లో చేరాడు. ఈ ప్రోటియాస్ బౌలర్ జాక్ కలిస్‌ను వెనక్కి నెట్టాడు.
దిగ్గజాల క్లబ్‌లో రబడా
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ మ్యాచ్‌లో రబడా ఇప్పటివరకు 9 వికెట్లు తీశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడం ద్వారా, మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టీ20) సౌతాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్ ఫైవ్ బౌలర్లలో రబడా చేరాడు. ఈ విషయంలో అతను జాక్ కలిస్‌ను అధిగమించాడు. రబడా పేరిట ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 575 వికెట్లు నమోదయ్యాయి. ఇక కలిస్ తన కెరీర్‌లో 572 వికెట్లు తీశాడు. రబడా కేవలం 242 మ్యాచ్‌లలో 575 వికెట్లు సాధించాడు. సౌతాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు షాన్ పొలాక్ పేరిట ఉంది, అతను 414 మ్యాచ్‌లలో మొత్తం 823 వికెట్లు తీశాడు.
Also Read: Gambhir Mother: ఐసీయూలో గంభీర్ తల్లి.. స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియా హెడ్ కోచ్!
మొదటి ఇన్నింగ్స్‌లో కూడా విధ్వంసం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో కూడా కగిసో రబడా తన మాయాజాలాన్ని చూపించాడు. రబడా ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. అతను 15.4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 51 పరుగులు ఖర్చు చేసి 5 వికెట్లు తీశాడు. రబడా.. ఖవాజా, కామెరూన్ గ్రీన్, వెబ్‌స్టర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఇకపోతే ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా జట్టుకు 282 విజయలక్ష్యం లభించింది. ప్రస్తుతం రెండో ఇన్సింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో మార్కరమ్ (15), ముల్దర్ (7) ఉన్నారు.