Site icon HashtagU Telugu

IND vs ENG: బ్యాటర్ గానే కేఎల్ రాహుల్: ద్రవిడ్

IND vs ENG

IND vs ENG

IND vs ENG: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాహుల్ ని కాదని ఇతర ఆటగాడికీ కీలక బాధ్యతలు అప్పజెప్పాడు. అయితే రాహుల్ ద్రవిడ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి నుంచి హైదరాబాద్‌ వేదికగా భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు.

సిరీస్‌ కోసం ఎంపిక చేసిన ఇంగ్లాండ్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న హ్యారీ బ్రూక్‌.. వ్యక్తిగత కారణాలతో యూకే వెళ్లిపోయాడు. అతడు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఇక టీమిండియా నుంచి సెలెక్ట్ అయిన విరాట్ కోహ్లీ కూడా తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడటం లేదు. వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ సీరీస్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇండియన్ టీం మేనేజ్మెంట్ కీపర్ విషయంలో కీలక మార్పు చేసింది. వన్డే ప్రపంచకప్‌తో పాటు, దక్షిణాఫ్రికాతో 2 మ్యాచుల టెస్టు సిరీస్‌లో వికెట్‌ కీపర్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచుల టెస్టు సిరీస్‌కు కీపింగ్ కి దూరంగా ఉండనున్నాడు. ఈ సిరీస్ మొత్తానికి కేఎల్ రాహుల్ కేవలం బ్యాటర్‌గానే జట్టులో కొనసాగుతాడని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.

ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు. అయితే రాహుల్‌ ఫార్మాట్లకు అతీతంగా వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. మంచి ఫామ్ లో ఆడుతున్న రాహుల్ ని కీపర్ గా తప్పించడమేంటని కొందరు బీసీసీఐ ని ప్రశ్నిస్తున్నారు. దీనికి బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. ముందున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ప్రయోగాలు చేయలేమని తేల్చిచెప్పింది. బ్యాటింగ్‌ పరంగా రాహుల్‌పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్‌ ద్రావిడ్‌ వివరణ ఇచ్చాడు. మరి ఈ సిరీస్‌లో టీమిండియా వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Nithin: నితిన్-వెంకీ కుడుముల కొత్త సినిమా అప్డేట్ ఇదే