Site icon HashtagU Telugu

Jyothi Yarraji: హర్డిల్స్ రేసులో భారత్ కు తొలి స్వర్ణం.. విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి..!

Jyothi Yarraji

Resizeimagesize (1280 X 720) (2)

Jyothi Yarraji: థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో భారతదేశానికి చెందిన జ్యోతి యర్రాజీ (Jyothi Yarraji) మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఛాంపియన్‌షిప్ రెండవ రోజు భారత అథ్లెట్లు 3 బంగారు పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జ్యోతితో పాటు అజయ్ కుమార్ సరోజ్, అబ్దుల్లా అబూబకర్ తమ తమ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు.

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో జ్యోతి యర్రాజీ 13.09 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ రేసులో జపాన్‌కు చెందిన మౌషుమీ ఓకీ 13.12 సెకన్లలో రేసును పూర్తి చేసింది. అదే సమయంలో పురుషుల 1500 మీటర్ల రేస్ ఈవెంట్‌లో భారత్‌కు రెండో రోజు రెండో బంగారు పతకం వచ్చింది. ఇందులో అజయ్ కుమార్ సరోజ్ 3.41.51 సెకన్లలో రేసును పూర్తి చేసి పతకం సాధించాడు. ఈ సమయంలో అజయ్ 3.42.04 సెకన్లతో రేసులో రెండవ స్థానంలో నిలిచిన జపాన్‌కు చెందిన యుషుకి తకాసిని వెనక్కి నెట్టాడు.

Also Read: IND vs WI: రెండో రోజు కూడా రఫ్ఫాడించారు.. సెంచరీల మోత మోగించిన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ..!

ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్ స్వర్ణం సాధించాడు

భారత్ నుంచి ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో పాల్గొన్న అబ్దుల్లా అబూబకర్ ఈ ఈవెంట్‌లో 16.92 మీటర్లు జంప్ చేసి బంగారు పతకాన్ని సాధించాడు. రెండో రోజు ఈ 3 స్వర్ణాలు కాకుండా భారత్‌కు 2 కాంస్య పతకాలు కూడా వచ్చాయి. ఇందులో ఒకటి మహిళల 400 మీటర్ల రేసులో ఐశ్వర్య మిశ్రా గెలుపొందగా, డెకాథ్లాన్ ఈవెంట్‌లో తేజస్విన్ శంకర్ 7527 పాయింట్లు సాధించి మరొకదాన్ని గెలుచుకుంది. ఛాంపియన్‌షిప్ మొదటి రోజు భారతదేశం 1 కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీనిని 10,000 మీటర్ల రేసులో అభిషేక్ పాల్ గెలుచుకున్నాడు.