Site icon HashtagU Telugu

IPL 2024: 2024 టార్గెట్ గా లక్నో సంచలన నిర్ణయం…మార్పు తప్పలేదు

IPL 2024

New Web Story Copy 2023 07 15t122544.203

IPL 2024: గత ఐపీఎల్ సీజన్లో టైటిల్ రేసులో ఉన్న లక్నో సూపర్ జాయింట్స్ ప్లేఆప్స్ లో వెనుదిరిగింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేయగా లక్నో 101 పరుగులకే కుప్పకూలింది. అయితే 2024 ఐపీఎల్ టైటిల్ పై కన్నేసిన లక్నో కొత్త హెడ్ కోచ్ ని నియమించుకుంది. ప్రస్తుత కోచ్ ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఆండీ ఫ్లవర్ రెండేళ్ల కాంట్రాక్ట్ ముగిసింది. అందుకే అండీ స్థానంలో లాంగర్ను నియమించింది. జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ సలహా మేరకు తాము లాంగర్‌ను సంప్రదించామని ఎల్‌ఎస్‌జి యజమాని సంజీవ్ గోయెంకా ఒక ప్రకటనలో తెలిపారు.

జస్టిన్ లాంగర్‌ ఆస్ట్రేలియా తరపున 8 వన్డే మ్యాచ్ లు 105 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 160 పరుగులు చేయగా..టెస్టుల్లో 23 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 30 అర్ధసెంచరీలతో 7696 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా లాంగర్ విజయవంతమైన కోచ్ గా ప్రూవ్ చేసుకున్నాడు. 2018లో లాంగర్ ఆస్ట్రేలియన్ జట్టు కోచ్‌గా పదవి చేపట్టాడు. ఆయన పదవి కాలంలో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0తో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 2021 లో అతని ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా మొదటిసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇది కాకుండా మూడుసార్లు బిగ్ బాష్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Read More: Mission Bhagiratha: విషాద ఉదంతం, మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య